Site icon HashtagU Telugu

ED Raid : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ రైడ్స్.. కారణం అదే !

Ed Raid

Ed Raid

ED Raid : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు చెందిన ఢిల్లీ నివాసంలో ఇవాళ ఉదయాన్నే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టీమ్ సోదాలు మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన ఆధారాల సేకరణ కోసం ఈడీ ఈ రైడ్స్ చేస్తోందని అంటున్నారు. ఇదే వ్యవహారంలో ఈ ఏడాది మే నెలలో సంజయ్ సింగ్, ఆయన సన్నిహితుల  ఇళ్లపై రైడ్స్ చేసిన ఈడీ కొంత సమాచారాన్ని సేకరించిందని, దాని ఆధారంగానే ఇప్పుడు మళ్లీ తనిఖీలు చేపట్టిందని చెబుతున్నారు. తాను ఇంట్లోనే ఉన్నానని, ఈడీ రైడ్స్ జరుగుతున్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్  స్వయంగా మీడియాకు తెలియజేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఫిబ్రవరి 28న ఆయన ఢిల్లీ మంత్రివర్గానికి రాజీనామా చేశారు. మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనున్న తరుణంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ రైడ్స్ చేయడం (ED Raid)  గమనార్హం.

సంజయ్ సింగ్ పై అభియోగాలు ఇవీ.. 

ఈడీ ఛార్జ్ షీట్ ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేష్ అరోరా గతంలో ఎంపీ సంజయ్ సింగ్ తో కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి అరవింద్ కేజ్రీవాల్‌ తో భేటీ అయ్యారు. ఢిల్లీలో దినేష్ అరోరాకు అన్‌ప్లగ్డ్ కోర్ట్‌యార్డ్‌ అనే రెస్టారెంట్ ఉంది. ఇందులోనే తొలిసారి సంజయ్ సింగ్ ను దినేష్ అరోరా కలిశాడు. ఆయన ద్వారానే మనీష్ సిసోడియాను పరిచయం చేసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఫండ్ కావాలని దినేష్ అరోరాను సంజయ్ సింగ్ అడిగారని.. దీంతో దినేష్ అరోరా ఢిల్లీలోని మరింత మంది రెస్టారెంట్ ఓనర్లతో మాట్లాడి రూ.32 లక్షల చెక్కును సిసోడియాకు ఇచ్చారని ఈడీ ఛార్జ్ షీట్ లో ఆరోపించింది. ఆ తర్వాత కూడా మనీష్ సిసోడియాతో సంజయ్ సింగ్ టచ్ లో ఉన్నారని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ డిపార్ట్‌మెంట్‌ లో దినేష్ అరోరాకు ఉన్న ఒక దీర్ఘకాలిక సమస్యను కూడా సంజయ్ సింగ్ చొరవ చూపి పరిష్కరించారని ఈడీ తెలిపింది.

Also read : Bus Falls From Bridge: వంతెనపై నుండి బస్సు పడి 21 మంది మృతి.. ఇటలీలో ఘటన..!

Exit mobile version