Site icon HashtagU Telugu

Byjus : ఆన్లైన్ ఎడ్యుకేషన్.. బైజుస్ సంస్థపై ఈడీ దాడులు

Loss-Making Companies

ED Raids on Byjus CEO Ravindran office and house

ఆన్లైన్ ఎడ్యుకేషన్(Online Education) లో టాప్ సంస్థగా ఎదిగింది బైజుస్(Byjus). బైజు రవీంద్రన్ బైజుస్ పేరుతో ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థని స్థాపించాడు. ఆ సంస్థ మంచి సక్సెస్ అయింది. ఇక కరోనా సమయంలో అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావడంతో బైజూస్ బాగా సక్సెస్ అయింది. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వచ్చాయి. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా బ్రాంచెస్ కూడా స్థాపించింది బైజూస్.

ఈ నేపథ్యంలో బైజూస్ లోకి భారీ పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా విదేశాల నుంచి భారీ ఎత్తున బైజూస్ లో పెట్టుబడులు వచ్చాయి. అయితే ఈ పెట్టుబడుల విషయంలో బైజూస్ సంస్థ CEO రవీంద్రన్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

దీంతో నేడు బైజుస్ ఆన్లైన్ సంస్థపై ఈడీ దాడులు చేసింది. బైజూస్ సంస్థ CEO రవీంద్రన్ కు చెందిన ఇళ్ళు, కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. బెంగళూరులోని మూడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విలువైన పత్రాలు, డిజిటల్ డేటా జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. విదేశీ మారక ద్రవ్య వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రన్ బైజుస్ పై ఈడీ కేసు నమోదు చేసింది.

 

Also Read :    Secretariat: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం పూర్తి వివరాలు ఇవే..!