Site icon HashtagU Telugu

ED Raids: `హెరాల్డ్` ఆఫీస్ పై ఈడీ సోదాలు

Enforcement Directorate

Enforcement Directorate

మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ప్రధాన కార్యాలయంతో సహా డజను ప్రాంతాల్లో దాడులు జ‌రిగాయి. ఆ విష‌యాన్ని ఈడీ అధికారులు వెల్ల‌డించారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద “నిధులకు సంబంధించి అదనపు సాక్ష్యాలను సేకరించేందుకు” సోదాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఫెడరల్ ఏజెన్సీ అధికారులు సెంట్రల్ ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ మార్గ్, ITO వద్ద ఉన్న ‘హెరాల్డ్ హౌస్’ కార్యాలయాన్ని కూడా శోధించారు. వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పేరుతో చిరునామా నమోదు చేయబడింది. ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ , ఆమె కుమారుడు రాహుల్ గాంధీని కాకుండా మరికొందరు కాంగ్రెస్ రాజకీయ నాయకులను ఈడీ ఇటీవల ప్రశ్నించింది.