Site icon HashtagU Telugu

ED Raids : రాజస్థాన్‌లో మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

Enforcement Directorate

Enforcement Directorate

సమాచార సాంకేతిక శాఖ సస్పెన్షన్‌లో ఉన్న జాయింట్ డైరెక్టర్ వేద్ ప్రకాష్ యాదవ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జైపూర్, ఢిల్లీ, ముంబై, ఉదయ్‌పూర్‌లోని 17 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తుంది. ఈ సోదాల్లో రూ.3 కోట్ల విలువైన 5.3 కిలోల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. బంగారంతో పాటు, ఈడీ అధికారులు కేసుకు సంబంధించిన నేరారోపణ పత్రాలు, పెన్ డ్రైవ్‌లు, ఫైళ్లు, ఇతర ఆధారాలను కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. నెల రోజుల క్రితమే మనీలాండరింగ్ కేసులో యాదవ్‌ను ఈడీ అరెస్టు చేసింది. జైపూర్‌లోని డిఓఐటి కార్యాలయం నుంచ ఇ-మిత్ర ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌లను డిఓఐటి ద్వారా పొందిన కంపెనీల వారి నివాసాలు, కార్యాలయ ప్రాంగణాలతో సహా వివిధ ప్రదేశాలలో సోదాలు జరిగాయి. వీటిలో చాలా వరకు వేద ప్ర‌కాశ్ యాదవ్ పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. యోజనా భవన్‌లోని వేద ప్ర‌కాశ్‌ యాదవ్ కార్యాలయంలోని అల్మీరాలో రూ.2.3 కోట్ల నగదు, 1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఆగస్టు 10న యాదవ్‌ను అరెస్టు చేశారు.