Site icon HashtagU Telugu

National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజ‌రైన క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్‌

Enforcement Directorate

Enforcement Directorate

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. APJ అబ్దుల్ కలాం రోడ్‌లోని ఏజెన్సీ కార్యాలయంలోకి అడుగు పెట్టే ముందు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. , తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని తెలిపారు. భారత్ జోడో యాత్రను కర్ణాటకలో జ‌రుగుతుంది. యాత్రలో నుంచే నేరుగా ఢిల్లీ చేరుకున్నట్లు డీకే శివ‌కుమార్‌ తెలిపారు. శివకుమార్ గురువారం యాత్రలో పార్టీ నేతలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. శివకుమార్ గత సెప్టెంబర్ 19న ఢిల్లీలో ఈడీ ఎదుట హాజరయ్యారు, అక్కడ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ముడిపడి ఉన్న మరో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్‌ను కలిగి ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి శివకుమార్, అతని సోదరుడు DK సురేష్ విరాళంగా ఇచ్చిన డ‌బ్బును గురించి ఈడీ ప్ర‌శ్నలు అడిగిన‌ట్లు తెలుస్తుంది. ఈ లావాదేవీల వివరాలను ఏజెన్సీ తెలుసుకోవాలనుకుంటున్నట్లు వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జె గీతారెడ్డితో పాటు మరికొందరు పార్టీ నేతలను కూడా ఏజెన్సీ వారు గతంలో చేసిన ఇలాంటి లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించారు.