ED Officer Suicide : అరెస్టు అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు.సాధారణంగానైతే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి అంటే అవినీతిపరులకు దడ. ఇటీవలే ఈడీ దాడులతో ఎంత మంది రాజకీయ ప్రముఖుల్లో జైలుపాలయ్యారో మనందరికీ తెలుసు. అలాంటి ఈడీలో పనిచేస్తున్న ఓ అధికారి కూడా అరెస్టుకు భయపడిపోయాడు. ఏం చేయాలో అర్థంకాక సూసైడ్ చేసుకొని చేతులారా విలువైన ప్రాణాలు తీసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని సాహిబాబాద్ ఏరియాలో ఉన్న రైల్వేట్రాక్ పక్కన ఈడీ అధికారి అలోక్ రంజన్(ED Officer Suicide) డెడ్ బాడీ దొరికింది. పోలీసులు ఘటనాస్థలి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
అలోక్ రంజన్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ వాస్తవ్యుడు. గతంలో ఆయన ఆదాయపను పన్ను శాఖలో పనిచేసేవారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఈడీలో పనిచేస్తున్నారు. అవినీతి ఆపాల్సిన ఆయన కూడా ఇటీవలే అవినీతి కేసులో చిక్కుకున్నారు. ఈవిషయంలో సీబీఐ అధికారులు అలోక్‌ను రెండుసార్లు విచారించారు. నేరం చేసినట్టు ఆధారాలు దొరకకపోవడంతో ఆయనను సీబీఐ అధికారులు వదిలేశారు. అసలు విషయం ఏమిటంటే.. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ కొన్నిరోజుల క్రితమే ముంబైకి చెందిన ఒక నగల దుకాణంపై రైడ్ చేశారు. సదరు దుకాణం నిర్వాహకుడి కుమారుడిపై కేసు పెడతానని బెదిరించారు. దీంతో రూ.20 లక్షలు లంచం ఇచ్చేందుకు సదరు దుకాణం యజమాని ఒప్పుకున్నాడు. అనంతరం దీనిపై సీబీఐకి సమాచారం అందజేశాడు. తదుపరిగా రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Also Read :Unclaimed Bodies Sold : అనాథ శవాలనూ అమ్ముకునేవాడు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌పై సంచలన ఆరోపణలు
ఈ కేసులో సందీప్‌ను సీబీఐ విచారించగా అలోక్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. రూ.50 లక్షల లంచం కేసులో అలోక్ కూడా భాగస్తుడిగా ఉన్నాడని సీబీఐ అధికారులకు సందీప్ చెప్పాడు. దీంతో అలోక్‌ను సీబీఐ అధికారులు రెండుసార్లు పిలిచి ప్రశ్నించారు. దీంతో ఎప్పుడూ అలోక్ ఆందోళనకరంగా కనిపించేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అరెస్టు భయం, తన ప్రతిష్ఠ దెబ్బతిందనే మనస్థాపంతోనే అలోక్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అంటున్నారు.