Arvind Kejriwa: ఏడోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 11:24 AM IST

 

 

Arvind Kejriwal :  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు జారీకావటం ఇది ఏడోసారి. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

గ‌తంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్‌ ప‌ట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయితే అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్‌ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏడోసారి ఈడీ సమన్లు పంపింది. తాజా నోటీసులపై సీఎం ఇంకా స్పందించలేదు. అయితే, ఈసారైనా విచారణకు వెళ్తారో లేదో చూడాలి.

read also : Satyapal Malik: మాజీ గవర్నర్ ఇంటితో సహా 30కి పైగా ప్రాంతాల్లో సీబీఐ దాడులు..!

కాగా, ఆప్ ప్రభుత్వంలో గతంలో రద్దయిన మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‎కు నోటీసులు జారీచేసింది. ఈ తరుణంలోనే ఫిబ్రవరి 17న సీఎం కేజ్రీవాల్ కోర్టుకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఫిబ్రవరి 17న ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలతో పాటు అవిశ్వాస తీర్మానం ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు కేజ్రీవాల్ న్యాయవాధి రమేష్ గుప్తా. అలాగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారని కోర్టుకు తెలిపారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కాస్త ఉపశమనం కల్పించారు.

Follow us