Site icon HashtagU Telugu

Chidambaram : ఆర్థికరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ వాళ్లకు పట్టట్లేదుః చిదంబరం

Jamili elections are impossible in the country: Chidambaram

Jamili elections are impossible in the country: Chidambaram

Chidambaram: భారత ఆర్థికరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ(bjp)వాళ్లకు పట్టట్లేదని మాజీ అర్థికశాఖ మంత్రి పి.చిదంబరం(Chidambaram) మండిపడ్డారు. 2023-24 సంవత్సరంలో భారత ఆర్థికరంగం గొప్పగా ఉందన్న నరేంద్ర మోడీ(Narendra Modi) వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించారు. విదేశీ పెట్టుబడుల్లో 31 శాతం కోత పడ్డ విషయాన్ని ప్రస్తావించారు. భారత ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వ పాలసీలపై తగ్గుతున్న నమ్మకానికి ఇది కొలమానమని వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, వాస్తవ వేతనాల్లో పెరుగుదల జాడే లేదు. నిరుద్యోగిత పెరుగుతోంది. కుటుంబాల్లో వినియోగం తగ్గుతోంది. ఆర్థిక రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందనేందుకు ఇవన్నీ సంకేతాలే. కానీ బీజేపీ ‘డాక్టర్లు’ మాత్రం ఈ విషయాలను పట్టించుకోరు’’ అని ఆయన అన్నారు.

Read Also: Hari Rama Jogayya : కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించబోతున్న హరిరామ జోగయ్య

దేశీ మదుపర్లకు కూడా ప్రభుత్వ విధానాలపై నమ్మకం తగ్గిందని అన్నారు. ఫలితంగా పెట్టుబుడులు తగ్గి నిర్మలా సీతారామన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అయినా, ఫలితం లేకపోవడంతో పెట్టుబడులు పెంచాలంటూ వారికి విజ్ఞప్తులు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు పాలసీలు, ఆర్థిక రంగ అసమర్థ నిర్వహణను విదేశీ మదుపర్లు గుర్తించి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని అన్నారు.

Read Also: Kejriwal Arrest : కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ ఆర్థికరంగం చుట్టూ తిరుగుతోంది. తమ హయాంలో దేశ ఆర్థికరంగం దూసుకుపోయిందని బీజేపీ ప్రచారం చేసుకుంటుంటే అదంతా బూటకమంటూ కాంగ్రెస్ కొట్టిపారేసే ప్రయత్నం చేస్తోంది.