Site icon HashtagU Telugu

EC Warning: జనసేన, తెలంగాణ జనసమితి, ప్రజాశాంతి పార్టీలపై ఈసీ కొరడా..!!

Election Commission

Election Commission

ఎన్నికల సంఘం గుర్తింపు పొందని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ పార్టీలన్నీ నియమనిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఈసీ గుర్తించింది. దీంతో చర్యలు తప్పవని హెచ్చరించింది. సాధారణంగా రాజకీయ పార్టీల్నీ అవి సేకరించిన విరాళాల రిపోర్టును ఈసీకి అందించాల్సి ఉంటుంది. అలాగే పేర్ల మార్పిడి, ప్రధాన కార్యాలం, ఆఫీ్ బేరర్లు చిరునామాల వివరాలను ఎన్నికల కమిషన్ కు అందించాలి.

అయితే గుర్తింపు పొందరి పార్టీలన్నీ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఈసీ తెలిపింది. దేశంలో ఇలాంటి పార్టీలు 2,100పైగానే ఉన్నట్లు తెలిపింది. వీటన్నింటిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్న ఈసీ…ఎలాంటి చర్యలు అన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈసీ పేర్కొన్న పార్టీలో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన, ప్రొఫెసర్ కోదండరాంకు చెందిన తెలంగాణ జనసమితి, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలు ఉన్నాయి.