Site icon HashtagU Telugu

EC Warns : హద్దులు మీరి ప్రవర్తిస్తే బాగోదు..పొలిటికల్ పార్టీలకు ఈసీ హెచ్చరిక

111

What is the election code?..what are the rules after the code comes into force?

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా (General Elections 2024) మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (The Election Commission of India ) ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌ (Sh. Rajiv Kumar) లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు సంబదించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 19న నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 26న, మూడో దశ ఎన్నిలక పోలింగ్‌ మే 7న, నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మే 13న, ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ మే 20న, ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ మే 25న, ఏడో దశ ఎన్నికల పోలింగ్‌ జూన్‌ 1న జరుగనున్నాయి. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దశలో, ఒడిశా రాష్ట్రానికి రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ తొలి దశ ఎన్నికలతోపాటు ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. ఏపీ అసెంబ్లీకి కూడా లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలతో పాటు మే 13న ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి లోక్‌సభ నాలుగు, ఐదు, ఆరు, ఏడు దశల ఎన్నికలతోపాటు నాలుగు దశల్లో మే 13న, మే 20న, మే 25, జూన్‌ 1న పోలింగ్‌ జరగనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే సీఈసీ రాజీవ్ కుమార్ (Sh. Rajiv Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తామని, అందరూ ఇందుకు సహకరించాలని కోరారు. ఇదే సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ (Model Code of Conduct) గురించి ప్రస్తావించారు. ప్రచారం చేసే సమయంలో రాజకీయ పార్టీలు హద్దులు మీరి ప్రవర్తించొద్దని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అనవసరంగా ఎవరూ నోరు జారొద్దని స్పష్టం చేశారు. స్టార్ క్యాంపెయినర్ల బాధ్యతలకు సంబంధించీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే చాలా సార్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ నిబంధనని ఉల్లంఘించిన ఘటనలు నమోదయ్యాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కులం, మతం పేరుతో దూషించుకోడంపైనా హెచ్చరించారు. అలాగే వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

Read Also : Charlapally: 430 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్