PM Modis Speech : కీలక పరిణామం.. ప్రధాని ప్రసంగంపై ఫిర్యాదుల పరిశీలన మొదలుపెట్టిన ఈసీ

PM Modis Speech : రాజస్థాన్‌‌లోని బన్స్వారా సభలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 04:07 PM IST

PM Modis Speech : రాజస్థాన్‌‌లోని బన్స్వారా సభలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ప్రధాని ప్రసంగంలోని వివాదాస్పద అంశాలపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్, సీపీఎం చేసిన ఫిర్యాదులను పరిశీలించే ప్రక్రియను ఈసీ షురూ చేసింది. ఈవిషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join

‘‘దేశంలోని ఓ మైనారిటీ వర్గానికే దేశపు ఆస్తులపై తొలి హక్కు ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా ఏళ్లక్రితమే చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లిం సమాజానికి వనరులను కేటాయించేందుకు ప్రాధాన్యత ఇస్తాయి’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మెజారిటీ వర్గం నుంచి నిధులను లాక్కొని ఓ మైనారిటీ వర్గానికి పంచడమే కాంగ్రెస్ ప్రభుత్వాల పని  అంటూ రాజస్థాన్‌‌లోని బన్స్వారాలో జరిగిన సభలో మోడీ నిప్పులు చెరగడం వివాదానికి దారితీసింది.

Also Read : PM Modi : ఖరారైన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలు..

ప్రధాని మోడీ ప్రసంగంలోని అభ్యంతరకర అంశాలపై ఇటీవల ఈసీకి కాంగ్రెస్ నేతల టీమ్ ఫిర్యాదును అందించింది. ఫిర్యాదులోని ప్రధాన అంశాల విషయానికొస్తే.. 

  • బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ఓ మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
  • ప్రధాని మోడీ వ్యాఖ్యలు దేశ ప్రజల మధ్య విభజనను క్రియేట్ చేసేలా ఉన్నాయి.
  • ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఓ మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు.
  • ఇది ఎన్నికల కమిషన్‌కు అగ్నిపరీక్ష లాంటిది. ఈసీ ప్రతిష్టకు సంబంధించిన విషయమిది.
  • ఈ వ్యవహారంలో అందరిలాగే ప్రధాని మోడీకి కూడా ఎన్నికల కోడ్‌ను ఈసీ వర్తింపజేయాలి.
  • ఎన్నికల కోడ్ ప్రకారం అందరూ నడుచుకునేలా చేయడం ఈసీ రాజ్యాంగపరమైన బాధ్యత.

Also Read :CM Jagan : పులివెందులలో రేపు సీఎం జగన్‌ నామినేషన్‌..

ప్రధాని మోడీ ప్రసంగంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం ఏమన్నారంటే..  

  • ప్రధాని మోడీ వివాదాస్పద ప్రసంగంపై వెంటనే ఈసీ చర్యలు చేపట్టాలి.
  • ప్రజల మధ్య వర్గ విభేదాలు క్రియేట్ చేసేలా విద్వేష ప్రసంగం చేసినందుకు ప్రధాని మోడీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.
  • ఓ వర్గం మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు , విద్వేషాలను రెచ్చగొట్టినందుకు ప్రధానిపై తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.