Haryana Elections 2024: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయా లేదా అనే కోణంలో నిఘా పెడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పోస్ట్ చేసిన ఓ వీడియోపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించి బీజేపీ హర్యానా యూనిట్ సోషల్ మీడియా పోస్ట్‌ను ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. పార్టీకి నోటీసులు కూడా పంపింది.
ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసుపై గురువారం సాయంత్రం 6 గంటలలోపు సమాధానం ఇవ్వాలని కోరింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల సంబంధిత కార్యకలాపాలకు పిల్లలను ఉపయోగించుకోవడం విరుద్ధం. హర్యానా బీజేపీ తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ నోటీసును జారీ చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికల ప్యానెల్ రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులను రాజకీయ ప్రచారాలు మరియు ర్యాలీలలో పిల్లలను ఏ విధంగానూ ఉపయోగించుకోవద్దని కోరింది. ర్యాలీలు, నినాదాలు, పోస్టర్లు లేదా కరపత్రాల పంపిణీ లేదా ఎన్నికల సంబంధిత కార్యకలాపాలతో సహా ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పిల్లలను పాల్గొనవద్దని రాజకీయ పార్టీలు స్పష్టంగా నిర్దేశించబడ్డాయి.
बच्चे-बच्चे की पुकार, हरियाणा में फिर से नायब सरकार pic.twitter.com/8hxogtVL6A
— Haryana BJP (@BJP4Haryana) August 27, 2024
హర్యానా బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోను ఆగస్టు 27న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలోసైనీ ప్రభుత్వంపై ఓ చిన్నారి నినాదాలు చేస్తోంది. జై హింద్ అని చెప్పడం కనిపించింది. ఈ వీడియోలోని మరో ఫ్రేమ్‌లో ముఖ్యమంత్రి నాయబ్ సైనీ కూడా పిల్లలతో కలిసి కనిపిస్తున్నారు. ఈ వీడియో మొత్తం 36 సెకన్లు ఉంది.
Also Read: IPL Mega Auction: ఆర్సీబీ టార్గెట్ ఆ ముగ్గురేనా..?