Amid Heatwave Warning, Poll Panel Issues Advisory For Voters' Safety
EC key points: వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అంచనా వేసింది (Heatwave Warning). మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. హీట్‌వేవ్ నేపథ్యంలో ఓటర్లకు కీలక సూచనలు చేసింది (Poll Panel Issues Advisory).
లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడించననుంది. ఈ ఎన్నికల సమయంలోనే ఎండలు కూడా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈసీ ఓటర్ల (Voters)కు పలు సూచనలు చేసింది.
ఓటర్లకు ఈసీ చేసిన సూచనలు ఇవే..
.ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి. .ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 మధ్య బయట పనులు మానుకోవాలి. .దాహం వేయకపోయినా తరచూ వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి. .తేలికైన, లైట్ కలర్, వదులుగా, పోరస్ కాటన్ దుస్తులను ధరించాలి. .ఎండలో బయటకు వెళ్లేటప్పుడు రక్షణగా కళ్లజోళ్లు, గొడుగు లేదా టోపీ, కాళ్లకు బూట్లు లేదా చప్పల్స్ ఉపయోగించాలి. .బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు శ్రమతో కూడిన పనులను మానుకోవాలి. .ప్రయాణ సమయంలో మంచి నీటిని మీ వెంట తీసుకెళ్లాలి. .శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. .అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోకూడదు. .పార్క్ చేసిన వాహనాల్లో పిల్లల్ని, పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దు. .అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. .ఓఆర్‌ఎస్ లేదా ఇంట్లో తయారు చేసిన లస్సీ, తోరణి (బియ్యం నీరు), నిమ్మకాయ నీరు, మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరం డీహైడ్రేట్ కాకుండా సాయపడతాయి. .జంతువులను వీలైనంత ఎక్కువగా నీడలో ఉంచాలి. వాటికి తాగడానికి నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. .ఇంటిని వీలైనంత చల్లగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట కిటికీలను తెరిచిపెట్టుకోవాలి. .ఫ్యాన్లు, తడి దుస్తులను ఉపయోగించాలి. అదేవిధంగా తరచుగా చల్లటి నీటితో స్నానం చేయాలి.