Earthquake : బెంగాల్, లడఖ్‌లో భూప్రకంపనలు.. బంగ్లాదేశ్ భూకంపం ఎఫెక్ట్
Pasha
Chile Earthquake
Earthquake : పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢాకా, చిట్టగాంగ్, రాజ్‌షాహి, సిల్హెట్, రంగ్‌పూర్, చుడంగా, నోఖాలీలలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడి భూకంపం ఎఫెక్టుతో భారత్‌లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బెంగాల్‌లోని కోల్‌కతా, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హుగ్లీ సహా ఉత్తర బెంగాల్‌లోని వివిధ జిల్లాల్లో పలుచోట్ల ప్రకంపనలు సంభవించాయి. అయితే వీటి వల్ల రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదని పశ్చిమ బెంగాల్ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగ్లాదేశ్‌లో భూమికి 55 కిలోమీటర్ల లోతులో ఉదయం 9.05 గంటలకు భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
భారత్‌లోని లడఖ్‌లో ఇవాళ ఉదయం 8:25 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. లేహ్, లడఖ్ ప్రాంతాలు మన దేశంలోని సిస్మిక్ జోన్-IVలో ఉన్నాయి. ఇక్కడ భూకంపాలు సంభవించే రిస్క్ ఎక్కువ. టెక్టోనికల్ యాక్టివ్ హిమాలయా ప్రాంతంలో ఉన్న లేహ్, లడఖ్ ప్రాంతాల్లో తరుచుగా భూప్రకంపనలు సంభవిస్తూనే ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మన దేశాన్ని నాలుగు సీస్మిక్ జోన్‌లుగా వర్గీకరించింది. ఆ జోన్లను.. V, IV, III, II అని పిలుస్తారు. జోన్ Vలో భూకంపాలు సంభవించే రిస్క్ ఎక్కువ. జోన్ IIకు భూకంపాల(Earthquake) రిస్క్ చాలా తక్కువ.