Tremors In India : ఇవాళ తెల్లవారుజామున నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్-టిబెట్ బార్డర్‌కు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో ఇవాళ ఉదయం 6.35 గంటలకు భూకంపం వచ్చింది. లబుచె ప్రాంతం నేపాల్ రాజధాని ఖాట్మండుకు 150 కి.మీ దూరంలో ఉంది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్ రాజధాని ఖాట్మండు సహా పలు జిల్లాల్లో ప్రజలు భూప్రకంపనలను ఫీలయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 2015 ఏప్రిల్‌లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో దాదాపు 9వేల మంది చనిపోయారు. అయితే ఈసారి ఎంత నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియరాలేదు.
Also Read :Rukmini Vasanth : ఎన్టీఆర్ సినిమా.. కోరి కష్టాలు తెచ్చుకున్న హీరోయిన్..!
బిహార్, ఢిల్లీ, బెంగాల్‌లపై ఎఫెక్ట్
నేపాల్, టిబెట్‌లకు సమీపంలో ఉండే పలు భారతదేశ రాష్ట్రాలపైనా భూకంపం ఎఫెక్ట్(Tremors In India) పడింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. బిహార్‌లోని పాట్నా, సారన్ ప్రాంతాల ప్రజలు తాము భూప్రకంపనలను ఫీలయ్యామని వెల్లడించారు. మరోవైపు చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లలోని పలు ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయని తెలిసింది.అంతకుముందు రోజు (సోమవారం) ఉదయం కూడా నేపాల్‌లో భూకంపం వచ్చింది. దాని ప్రభావంతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఆ భూకంప కేంద్రాన్ని నేపాల్‌లోని గోకర్ణేశ్వర్‌లో గుర్తించారు. నేపాల్ దేశం యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్స్‌తో కూడిన సున్నితమైన భూభాగంలో ఉంది. దీంతో ఆ ప్రాంతానికి భూకంపాల ముప్పు ఎక్కువ.