Earthquake: ఢిల్లీ -ఎన్సీఆర్ లో మళ్లీ భూప్రకంపనలు…ఒక నెలలో మూడోసారి..!!

దేశరాజధానిలో ఢిల్లీలో మంగళవారం అర్థరాత్రి మరోసారి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం…తేలికపాటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 2.5గా నమోదైంది. దీని కేంద్రం న్యూఢిల్లీకి పశ్చిమాన 8కిలోమీటర్ల దూరంలో ఉంది. భయాందోళనతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఒకే నెలలో ఇది మూడోసారి కావడంతో ఎప్పుడు ఏం జరగుతుందో తెలియక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా రెండుసార్లు భూమి కంపించడంతో ఢిల్లీ వణికిపోయింది. నవంబర్ 9న మొదటిసారిగా […]

Published By: HashtagU Telugu Desk
Earthquake

Peru Earthquake

దేశరాజధానిలో ఢిల్లీలో మంగళవారం అర్థరాత్రి మరోసారి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం…తేలికపాటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 2.5గా నమోదైంది. దీని కేంద్రం న్యూఢిల్లీకి పశ్చిమాన 8కిలోమీటర్ల దూరంలో ఉంది. భయాందోళనతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఒకే నెలలో ఇది మూడోసారి కావడంతో ఎప్పుడు ఏం జరగుతుందో తెలియక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా రెండుసార్లు భూమి కంపించడంతో ఢిల్లీ వణికిపోయింది. నవంబర్ 9న మొదటిసారిగా భూకంపం సంభవించింది. దీని కేంద్రం నేపాల్ లో ఉందని చెప్పారు. దీని తీవ్రత రిక్టస్ స్కేలుపై 6.3గా నమోదు అయ్యింది. తర్వాత నవంబర్ 12న మరోసారి భూమి కంపించింది. ఈ సారి కూడా నేపాల్ కేంద్రం ఉందని దానీ తీవ్రత 5.4గా నమోదు అయ్యింది.

  Last Updated: 30 Nov 2022, 05:31 AM IST