Dwakra Drones: మహిళలకు డ్వాక్రా డ్రోన్లు…కేంద్రం కీలక నిర్ణయం

డ్వాక్రా మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. స్వయం సహాయక సంఘాలకు కేంద్రం డ్రోన్లను అందజేయనుంది. ఈ డ్రోన్‌లను రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా స్వయం సహాయక సంఘాలు

Dwakra Drones: డ్వాక్రా మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. స్వయం సహాయక సంఘాలకు కేంద్రం డ్రోన్లను అందజేయనుంది. ఈ డ్రోన్‌లను రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా స్వయం సహాయక సంఘాలు ఉపాధి పొందవచ్చని కేంద్రం భావిస్తుంది. 2023 నుంచి 2026లోపు డ్వాక్రా మహిళలకు 15 వేల డ్రోన్లు అందించాలని కేంద్రం నిర్ణయించగా.. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేంద్రం రూ.1,261 కోట్లు కేటాయిస్తుంది.

లబ్ధిదారులకు గరిష్టంగా రూ.8 లక్షల సాయం అందుతుందని కేంద్రం పేర్కొంది. డ్రోన్లు పొందిన స్వయం సహాయక బృందాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తారు. దీంతోపాటు వ్యవసాయ పనులపై 10 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. తద్వారా రైతులు డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ మరియు ఎరువులు వేయవచ్చు. డ్రోన్ల సాయంతో వ్యవసాయ పనులు చేయడం వల్ల చాలా సమయం ఆదా కావడమే కాకుండా మానవ వనరుల కొరతను అధిగమించవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చని కేంద్రం భావిస్తోంది.

Also Read: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన మొత్తం విలువ రూ.745 కోట్లు