Site icon HashtagU Telugu

Drunk On Liquor: మ‌ద్యం మ‌త్తులో భ‌లే దొరికేశాడు.. 30ఏళ్ల నాటి హ‌త్య వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన వ్య‌క్తి

Avinash Pawar

Avinash Pawar

మ‌ద్యం మ‌త్తులో ఓ వ్య‌క్తి తాను 30ఏళ్ల క్రితం చేసిన హ‌త్య గురించి వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాడు. ఫ‌లితంగా పోలీసుల‌కు చిక్కి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. ఈ విచిత్ర ఘ‌ట‌న ముంబైలో చోటు చేసుకుంది. లోనాహ‌లాలో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్న అవినాష్ ప‌వార్ 30ఏళ్ల క్రితం 1993లో మ‌రో ఇద్ద‌రు స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఓ ఇంట్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు. ఇంట్లోని వృద్ధ దంప‌తుల‌ను హ‌త్య‌చేసి న‌గ‌దు తీసుకొని ప‌రార‌య్యారు. అయితే, వారిలో ఇద్ద‌రు వ్య‌క్తులు దొర‌క‌గా అవినాష్ ప‌వార్ మాత్రం ప‌రార‌య్యాడు. పోలీసులు గాలించినా ఆచూకీ ల‌భ్యంకాలేదు. ప‌వార్ త‌న త‌ల్లిని ఢిల్లీలో వ‌దిలి మ‌హారాష్ట్రంలోని ఔరంగాబాద్ కు వెళ్లిపోయాడు.

ఔరంగాబాద్‌లో అమిత్ ప‌వార్‌గా పేరుమార్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. ప‌వార్ అక్క‌డి నుంచి వెళ్లి ముంబైలోని విక్రోలిలో స్థిర‌ప‌డ్డాడు. అమిత్ ప‌వార్ పేరుతో ఆధార్ కార్డుకూడా పొందాడు. వివాహం చేసుకున్నాడు. అత‌ని భార్య విజ‌య‌వంత‌మైన రాజ‌కీయ జీవితానికి స‌హ‌కారం అందించాడు. ముప్పై ఏళ్లు గ‌డిచిపోయాయి. ప్ర‌స్తుతం అమిత్ ప‌వార్‌కు 49ఏళ్లు. తాను పెళ్లి చేసుకున్న త‌రువాత జీవితంలో వెన‌క్కు తిరిగి చూడ‌లేదు. ఇటీవ‌ల అమిత్ ప‌వార్ ఓ ఫంక్ష‌న్‌కు హాజ‌ర‌య్యాడు. అక్క‌డ తోటి స‌హ‌చ‌రులు ప‌వార్‌ను మ‌ద్యం సేవించాల‌ని కోరారు. దీంతో ప‌వార్ మ‌ద్యం సేవించాడు.

అతిగా మ‌ద్యం సేవించ‌డంతో తాను 30ఏళ్ల క్రితం చేసిన వృద్ధ‌దంప‌తుల హ‌త్య గురించి బ‌య‌ట‌పెట్టాడు. వృద్ధుల‌ను ఎలా హ‌త్య చేశామో వివ‌రించాడు. ఈ విష‌యాన్ని అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ముంబై క్రైం బ్రాంచ్ కు చెందిన సీనియ‌ర్ పోలీసు ఇన్ స్పెక్ట‌ర్, ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ద‌యానాయ‌క్ అక్క‌డికి వ‌చ్చి అమిత్ ప‌వార్‌ను అరెస్టు చేశాడు. ప్ర‌స్తుతం ప‌వార్ జైలు జీవితం గ‌డుపుతున్నాడు.

Honey Trap: హనీట్రాప్ లో ఇరుక్కుంటున్న యువత