Drunk Driving: ఢిల్లీలో ఘోరం.. యువతిని నాలుగు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. చివరికి?

కొత్త సంవత్సరం రోజే మన దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Medium 2023 01 01 5e6422a987

Medium 2023 01 01 5e6422a987

Drunk Driving: కొత్త సంవత్సరం రోజే మన దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ సుల్తాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఓ యువతి తన స్కూటీపై తెల్లవారుజామున వెళ్తుండగా ఆ సమయంలో ఓ కారు తన బండిని ఢీ కొట్టింది. కారులో ఉన్న యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో బాగా తాగి ఉన్నారు. దీంతో ఆమెను ఢీకొట్టడంతో ఏకంగా ఆమెను నాలుగు కిలోమీటర్ల రోడ్డుపై.

అయితే ఆమె డ్రెస్ కారు టైర్లు ఇరుక్కుపోవటంతో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఆ దుండగులు ఈడ్చికెల్లడంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. ఇక ఆ యువతి మృతదేహం రోడ్డుపై నగ్నంగా ఉండటంతో హత్యాచారం అని ముందుగా భావించారు. ఆ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆక్సిడెంట్ ద్వారా మరణించిందని తెలిసింది.

ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటల సమయంలో మృతదేహం సమాచారం అందిన విషయాన్ని ఓ సీనియర్ పోలీస్ తెలిపాడు. మహిళ మృతదేహాన్ని బలెనో కారుకు కట్టి ఈడ్చుకు వెళ్తున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడని అన్నాడు. ఆ తర్వాత కంఝావాల పోలీసులు ఆ విషయం గురించి తిరిగి ఫోన్ చేసిన వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేశారని.. ఆ తర్వాత అతడు ఆ కారుని గుర్తుపట్టాడని తెలిపాడు.

తర్వాత తమ బృందం అక్కడికి చేరుకోగా కేసు నమోదు.. ఇక మృతదేహాన్ని ఎస్జీఎం ఆసుపత్రికి పోస్టుమార్టంకి తరలించామని తెలిపాడు. ఆ తర్వాత కారులో ఉన్న ఆ ఐదుగురు దుండగులను సుల్తాన్ పురి పోలీస్ స్టేషన్ కు తరలించగా ఆ దుండగులు జరిగిన విషయాన్ని తెలిపారు.

  Last Updated: 01 Jan 2023, 10:09 PM IST