Site icon HashtagU Telugu

Drugs : ముంబైలో ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌.. ఇద్ద‌రు అరెస్ట్‌

Drugs Imresizer

Drugs Imresizer

ముంబై విమానాశ్రయంలో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా ఈ సంవత్సరంలో చేసిన మొదటి భారీ ఆపరేషన్‌లో ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారుఉలు రెండు వేర్వేరు కేసుల్లో రూ. 31.29 కోట్ల విలువైన 4.47 కిలోల హెరాయిన్‌ను, రూ. 15.96 కోట్ల విలువైన 1.596 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

జోహన్నెస్‌బర్గ్ నుండి నైరోబీ మీదుగా కెన్యా ఎయిర్‌వేస్ ఫ్లైట్ KQ 210 ద్వారా భారతీయ జాతీయతకు చెందిన ఒక ప్రయాణికుడు ముంబై విమానాశ్రయంలో దిగాడు. ప్రయాణికుల ప్రొఫైలింగ్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్లైట్ నుండి వెంటనే అతన్ని అనుసరించారు. స్మ‌గ‌ర్ల్ 12 డాక్యుమెంట్ ఫోల్డర్ కవర్లలో చాకచక్యంగా దాచిపెట్టి 4470 గ్రాముల హెరాయిన్ తీసుకువెళుతున్నట్లు క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించారు. పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసిన హెరాయిన్ పలుచని పొరలను ఈ ఫోల్డర్ కవర్లలో ఉంచారు. పట్టుబడిన డ్రగ్స్‌ మార్కెట్‌ విలువ దాదాపు రూ.31.29 కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Exit mobile version