Site icon HashtagU Telugu

Drugs : గుజ‌రాత్ తీరంలో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్‌

Drugs

Drugs

గుజరాత్ తీరంలో ఇరాన్ బోటులో పోలీసులు భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు. కచ్ జిల్లాలోని ఓఖా సమీపంలో గుజరాత్ తీరంలో రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్‌తో ఐదుగురు ఇరానియన్ సిబ్బందితో కూడిన ఇరాన్ పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పంచుకున్న నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ తన రెండు ఫాస్ట్ పెట్రోలింగ్ క్లాస్ షిప్‌లైన ICGS మీరా బెన్, ICGS అభీక్‌లను అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేస్తుండంగా ఈ డ్ర‌గ్స్ ఉన్న బోటు దొరికింది. రాత్రి సమయంలో ఓఖా తీరానికి 340 కిలోమీటర్ల దూరంలో భారత జలాల్లో ఒక పడవ అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గమనించారు. ఈ పడవ ఇరాన్ జాతీయతకు చెందిన ఐదుగురు సిబ్బందితో కూడిన ఇరాన్ పడవగా గుర్తించారు. ఐసీజీ బోర్డింగ్ బృందం జరిపిన విచారణలో బోటులో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. సిబ్బందితో పాటు పడవను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఓఖాకు తీసుకువస్తున్నామ‌ని అధికారులు తెలిపారు.

Exit mobile version