కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ఉన్నవారికి ఒక ముఖ్యమైన సూచన చేసింది. తమ డ్రైవింగ్ లైసెన్స్‌ను తప్పనిసరిగా మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కోరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికే చాలా మందికి సందేశాలు పంపుతోంది. లైసెన్స్‌ను మొబైల్ నంబర్(Mobile No)కు లింక్ చేయడం వల్ల పలు రకాల సేవలను ఆన్‌లైన్‌లో సులభంగా పొందవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను అనుసరించాలని సూచించింది.
డ్రైవింగ్ లైసెన్స్‌ను మొబైల్ నంబర్‌కు అనుసంధానం చేయడం వల్ల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్), డూప్లికేట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం, అడ్రస్ మార్పు వంటి సేవలను ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు. ఈ సేవలను పొందడానికి రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే అన్ని పనులను చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. అంతేకాకుండా, ముఖ్యమైన సమాచారాన్ని SMS ద్వారా నేరుగా మొబైల్‌కు పంపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
Supreme Court: 16 ఏళ్ల ముస్లిం బాలిక వివాహం చట్టబద్ధమే.. సుప్రీం కీలక తీర్పు!
డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేయడానికి, లైసెన్స్ సమాచారం ఉండే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆధార్ నంబర్‌ను ఉపయోగించి అథెంటికేషన్ చేయవలసి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ఈ ప్రక్రియను ధ్రువీకరించుకోవాలి. ఈ చర్యతో వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండడమే కాకుండా, లైసెన్స్‌కు సంబంధించిన సేవలను మరింత వేగవంతంగా పొందవచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్‌ను మొబైల్ నంబర్‌కు లింక్ చేయడం అనేది ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఇది పౌరులకు సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందిస్తుంది. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యకలాపాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ చిన్న మార్పుతో భవిష్యత్తులో లైసెన్స్ సంబంధిత వ్యవహారాలు మరింత సులభతరం అవుతాయని భావించవచ్చు.