Site icon HashtagU Telugu

DRDO : భద్రతా బలగాల కోసం అత్యంత తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్: డీఆర్‌డీవో

DRDO develops lightest bulletproof jacket against highest threat level

DRDO develops lightest bulletproof jacket against highest threat level

DRDO: దేశంలోని భద్రతా బలగాల(Security forces)కోసం అత్యంత తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌(Lightweight bullet proof jacket)ను డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలమెంట్‌ ఆర్గనెజేషన్‌ ( డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది. చండీగఢ్‌లో పరీక్ష నిర్వహించినట్టు వివరించింది. తీవ్రమైనదిగా పరిగణించే లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా దీనిని రూపొందించింది. ఈ జాకెట్ 7.62 x 54 ఆర్ ఏపీఏ మందుగుండు సామగ్రి పేలుడు నుంచి కూడా రక్షణనిస్తుందని డీఆర్‌డీవో ప్రకటనలో పేర్కొంది. కొత్త ప్రక్రియలో నూతన మెటీరియల్‌ను ఉపయోగించి దీనిని రూపొందించినట్టు పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

కాన్పూర్‌లోని డీఆర్‌డీవో విభాగం డీఎంఎస్ఆర్‌డీఈ (డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్) దీనిని తయారు చేసిందని తెలిపింది. మందుగుండు సామగ్రి నుంచి కూడా రక్షణ ఇవ్వగలదని, దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ ఇదేనని పేర్కొంది.

Read Also:World Leader : అగ్రరాజ్యంగా మేం కాకుంటే ఇంకెవరు ఉంటారు ? : బైడెన్

ఈ జాకెట్‌ కొత్త డిజైన్‌తో రూపొందిచడిందని, దీని తయారీలో ప్రత్యేక మెటీరియల్‌ను ఉపయోగించడంతో పాటు, కొత్త పద్దతిని అనుసరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ జాకెట్‌కు ఉన్న ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ (HAP) పలు హిట్ (ఆరు షాట్‌లు) లను ఎదుర్కొంది. సమర్థవంతంగా రూపొందించిన ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ పాలిమర్‌ను మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్‌తో తయారు చేశారు. ఇది ఆపరేషన్ సమయంలో సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని పెంచుతుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు రక్షణ శాఖ ఆర్అండ్‌ డీ సెక్రెటరీ, డీఆర్‌డీవో చైర్మన్.. DMSRDEని అభినందించారు.

Read Also:TS Inter Results: ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండిలా, వెబ్ సైట్‌లు ఇవే..!