Site icon HashtagU Telugu

Surface To Air Missile: స్వదేశీ టెక్నాలజీతో నూతన మిసైల్

Fgaa Soveai5fue Imresizer

surface to air missile

ఉపరితలం నుండి గాల్లోకి పంపగలిగే తక్కువ రేంజ్ మిసైల్ ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చందీపూర్ టెస్ట్‌ రేంజ్‌ నుంచి దీనిని పరీక్షించారు.దీన్ని ఇండియన్ నేవీలో పలు నౌకల్లో వినియోగించనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఈ మిసైల్ విజయవంతమవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ అభినందనలు తెలిపారు.

ఈ మిషన్ కి సంబందించిన మొదటి ట్రయల్ గత ఫిబ్రవరి 22న జరిగింది. ఇండియన్ నేవీ డీఆర్డీవో సంయుక్తంగా చేసిన
ఈ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేజ్ టూ ఎయిర్ మిసైల్ పూర్తిగా ఇండియన్ టెక్నాలజీతో డెవలప్ చేశారు.

సర్ఫేజ్ నుండి ఆకాశంలోకి ప్ర‌యోగించే ఈ నూతన మిసైల్స్ ను గతంలో వాడిన బ‌రాక్ 1 స్థానంలో వాడ‌నున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది.
ఆకాశంలో త‌క్కువ దూరంలో ఉన్న ల‌క్ష్యాల‌ను ఛేదించ‌డానికి ఈ VL-SRSAM మిసైల్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందని,
2006 నాటి అస్త్ర మార్క్ 1 ద్వారా ఈ మిసైళ్ల‌ను డెవ‌ల‌ప్ చేశామని నేవీ అధికారులు తెలిపారు. దానికి మ‌రి‌న్ని అధునాతన ఫీచ‌ర్స్ చేర్చడం వల్ల ఇది 360 డిగ్రీల్లో ల‌క్ష్యాల‌ను కూడా ఈటార్గెట్ చేయ‌గ‌ల‌దని డీఆర్డీవో ప్రకటించింది.