Site icon HashtagU Telugu

Anti Tank Missiles : ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే యాంటీ ట్యాంక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

Portable Anti Tank Missile Test

Anti Tank Missiles : మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌(ATGM)‌ను డీఆర్‌డీవో- ఇండియన్ ఆర్మీ విజయవంతంగా పరీక్షించాయి. ఈ టెస్టును రాజస్థాన్‌‌లోని జైసల్మీర్‌లో ఉన్న ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించారు. ఈ మిస్సైల్, దానిలోని వార్ హెడ్ ప్రయోగ పరీక్షలో అద్భుతంగా పనిచేశాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

We’re now on WhatsApp. Click to Join

మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌(Anti Tank Missiles)లో క్షిపణి, లాంచర్, టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. దీనితో శత్రువుల యుద్ధ ట్యాంకులపై దాడి చేయొచ్చు. రాత్రి టైంలో కూడా కచ్చితత్వంతో దాడులు చేసేందుకు ATGM‌ను వాడొచ్చు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగ పరీక్షలో విజయాన్ని సాధించినందుకు  డీఆర్‌డీవో, ఇండియన్ ఆర్మీని ఆయన అభినందించారు. భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా దీన్ని కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు.

Also Read :Punjab: టార్చ్‌లైట్ వేసి గర్భిణికి ప్రసవం, ఓ హాస్పిటల్ నిర్వాకం

త్వరలోనే వాయుసేనకు ‘సమర్2’.. ఏమిటిది ?

గగనతల రక్షణ వ్యవస్థ ‘సమర్ 2‌’ను త్వరలో భారత్ పరీక్షించనుంది. ఉపరితలం నుంచి గగన తలంలోకి వెళ్లి శత్రువుల రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసే సత్తా దీని సొంతం. భారత్‌లోనే తయారు చేస్తున్న ఈ మిస్సైల్ రేంజ్ 30 కిలోమీటర్లు. దీన్ని తొలిసారిగా డిసెంబరులో పరీక్షించబోతున్నారు.  సమర్ 2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను రెండు కంపెనీల సహకారంతో దీన్ని భారత్ తయారు చేస్తుంది. ఈ గగనతల వ్యవస్థ మొదటి వెర్షన్‌ సమర్ 1ను ఇప్పటికే వాయుసేనకు అందించారు. దీని రేంజ్ 8 కిలోమీటర్లు. రష్యన్ టెక్నాలజీతో సమర్ 1ను తయారు చేశారు. సమర్ 1లో R-73E మిస్సైల్ ఉంది. సమర్ 2లో R-27 వర్షన్‌కు చెందిన మిస్సైల్‌ను వాడనున్నారు.

Also Read :Royal Enfield : బైక్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే 2024 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350