Site icon HashtagU Telugu

ISRO : ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్

Dr.V.Narayanan took charge as the Chairman of ISRO

Dr.V.Narayanan took charge as the Chairman of ISRO

ISRO : ఇస్రో చైర్మన్ గా డాక్టర్ వి.నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వి.నారాయణన్ ఇస్రో చైర్మన్ గా రెండు సంవత్సరాల పాటు(జనవరి 14, 2027 )నసాగనున్నారు. చైర్మన్ కంటే ముందు ఆయన కేరళలోని వలియమాలాలో ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ చీఫ్‌గా పని చేస్తోన్నారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ, క్రయోజనిక్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ చేసిన నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. ఈ ఏడాదిలో ఇస్రోలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆదిత్య L1, చంద్రయాన్2, చంద్రయాన్ -3 వంటి చారిత్మక ప్రయోగాల్లో కీలక ఆయన పాత్ర పోషించారు.

రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్‌ చోదక వ్యవస్థల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ద్రవ, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్‌ చోదక వ్యవస్థల అభివృద్ధిలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-2, 3 వాహకనౌకల రూపకల్పనలోనూ కీలకభూమిక పోషించారు. నారాయణన్‌ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. వీ నారాయణన్ ఐఐటీ ఖరగ్ పూర్ లో క్రయోజనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చదివారు. అక్కడే ఏరో స్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఎంటెక్‌లో సిల్వర్ మెడల్ అందుకున్నారు. రాకెట్- అనుబంధ రంగంలో ఆయనకు ఉన్న ప్రతిభను గుర్తించి ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా బంగారు పతకాన్నీ అందించింది.

కాగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వి.నారాయణన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం సంస్థకు నాయకత్వం వహిస్తున్న ఎస్‌.సోమనాథ్‌ నుంచి జనవరి 14న (ఈరోజు ) నారాయణన్​ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read Also: AP Deputy CM : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ? టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వీడియో