Site icon HashtagU Telugu

Dowry Harassment : వ‌ర‌క‌ట్నం వేధింపుల‌కు మ‌హిళ బ‌లి.. భ‌ర్త‌, మామను అరెస్ట్ చేసిన పోలీసులు

Crime

Crime

తల్లిదండ్రుల నుంచి కట్నం తేవాలని భర్త, అత్తమామల వేధింపులకు గురైన ఓ మహిళ విషం తాగి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జ‌రిగింది. ముంబై పోలీసులు మహిళ భర్త, మామలను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన భర్త అభిషేక్ చావ్లా, అత్తమామలతో కలిసి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తోంది. అభిషేక్, అతని తండ్రి చంద్రభాన్ చావ్లా కలిసి స్క్రాప్ వ్యాపారం నిర్వహించారు. వారి వ్యాపారంలో నష్టాలు రావడంతో అభిషేక్ తన భార్య‌ను కట్నం తీసుకురావాల‌ని ఒత్తిడి చేయడం ప్రారంభించి ఆమెను వేధించాడు. అభిషేక్ తండ్రి కూడా కట్నం తీసుకురావాల‌ని కోడ‌ల‌పై ఒత్తిడి తెచ్చాడు. తండ్రీకొడుకులు మహిళను క‌ట్నం తీసుకుర‌మ్మ‌ని వేధించడం ప్రారంభించడమే కాకుండా ఆమెను కొట్టార‌ని పోలీసులు తెలిపారు. వేధింపులతో విసిగిపోయిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని విషం తాగి మృతి చెందింది. మహిళ బంధువు ఫిర్యాదు మేరకు నిర్మల్ నగర్ పోలీసులు అభిషేక్, అతని తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసులు తండ్రీకొడుకులపై ఐపీసీ సెక్షన్ 34, 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 323, 498 (ఎ) కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version