Rahul Gandhi: కుక్కలతో బీజేపీకి ఎందుకు అంత ఇబ్బంది?: రాహుల్ గాంధీ

భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్‌గాంధీ ఇచ్చిన బిస్కెట్ ని కుక్క తినకపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తి చేతిలో ఆ బిస్కెట్‌లు పెట్టాడు. ఇదే రాహుల్ చేసిన తప్పు. ఈ పరిణామం తర్వాత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శల దాడికి దిగింది.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కుక్క బిస్కెట్‌లు ఇచ్చి వాళ్ళను అవమానించారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కార్యకర్తలు అంటే రాహుల్‌గాంధీకి ముందునుంచి చిన్నచూపేనని దాడికి పాల్పడింది. ఈ క్రమంలో అసోం సీఎం హిమాంత బిశ్వశర్మ సహా పలువురు బీజేపీ నేతలు రాహుల్ తీరును తప్పుబట్టారు. అయితే బీజేపీ విమర్శలపై రాహుల్‌గాంధీ స్పందించారు.

జార్ఖండ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుంది. రాహుల్ యాత్రకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. అయితే ఓ వ్యక్తి తన శునకాన్ని తీసుకురావడంతో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బిస్కెట్ పక్కన ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చిందని రాహుల్ పేర్కొన్నాడు. అయినా కుక్కల వల్ల బీజేపీకి ఎందుకు అంత ఇబ్బంది అని రాహుల్ ప్రశ్నించారు. కుక్క బిస్కెట్లు తినడానికి నిరాకరించడంతో కుక్క యజమానిని బిస్కెట్లు తినిపించమని కోరానని రాహుల్ గాంధీ అన్నారు.

 

Also Read: Dates: నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం తీసుకోవడం జరిగే మార్పులు ఇవే?

  Last Updated: 06 Feb 2024, 07:43 PM IST