Site icon HashtagU Telugu

Kangana : ‘బీఫ్’ ఆరోపణల పై స్పందించిన బీజేపీ నేత కంగనా రనౌత్

'don't Consume Beef, I Am P

'Don't consume beef, I am proud Hindu': Kangana Ranaut calls claims 'baseless'

Kangana Ranaut: తాను బీఫ్(beef) తిన్నానంటూ కాంగ్రెస్ నేత విజ‌య్ వాడెట్టివార్(Congress leader Vijay Wadettiwar) చేసిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ(bjp) తరపున హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి పోటీచేస్తున్న కంగనా రనౌత్(Kangana Ranaut) తీవ్రంగా ఖండించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను బీఫ్ కానీ, మరేవిధమైన రెడ్‌మీట్ కానీ ఎప్పుడూ తినలేదని ఎక్స్ ద్వారా కంగన తెలిపారు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం గురించి ప్రచారం చేస్తున్నానని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసే ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని తేల్చి చెప్పారు. ప్రజలకు తానేంటో తెలుసని, తాను గర్వించదగిన హిందువునని, కాబట్టి తన గురించి ప్రజలను తప్పుదోవ పట్టించలేరని పేర్కొన్న ఆమె.. ‘జైశ్రీరామ్’ అని ముగించారు.

Read Also: Siddharth : ఎంగేజ్మెంట్ పై సిద్దార్థ్ కామెంట్స్.. మేము సీక్రెట్‌గా ఏమి చేసుకోలేదు..

కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే.