Donald Trump: నెక్స్ట్ టార్గెట్ తైవానే.. బాంబు పేల్చిన ట్రంప్..!

  • Written By:
  • Publish Date - March 4, 2022 / 01:44 PM IST

ప్ర‌స్తుతం ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్రం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. ర‌ష్యా,ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య మొద‌లైన యుద్ధం తీవ్ర‌త‌ర‌మ‌వుతున‌న క్ర‌మంలో, తైవాన్ పై దాడుల‌కు చైనా సిద్ధ‌మ‌వుతోంద‌ని ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భాగంగా ప్ర‌స్తుతం అమెరికా అధ్య‌క్ష‌డు జో బైడెన్ పై కూడా ట్రంప్ విమ‌ర్శ‌లు గుప్పించాడు.

ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న‌ ప‌రిణామాల‌ను డ్రాగ‌న్ దేశం డేగ‌క‌న్నుతో గ‌మ‌నిస్తోంద‌ని, ఈ క్ర‌మంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉత్సాహంగా వీటిని గ‌మ‌నిస్తున్నాడ‌ని, తైవాన్ పై జిన్పింగ్ తైవాన్ మీద ఎప్పుడు దండెత్తాలా అని ఎదురు చూస్తున్నారని ట్రంప్ చెప్పారు. అయితే ఈ యుద్ధాన్ని అగ్ర‌రాజ్య‌మైన అమెరికా ఆపలేద‌ని, ఎందుకంటే ఇప్పుడు వారి టైమ్ నడుస్తోందంటూ చైనా, రష్యాను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యాలు చేశారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబ‌న్లు అధికారం చేప‌ట్ట‌డం నుంచి అమెరికా బలగాలను యూఎస్ ఉపసంహరించుకున్న తీరుతోపాటు, కొందరు అమెరికన్ పౌరులను అక్కడే వదిలేయడాన్ని జిన్పింగ్ గ‌మ‌నించార‌ని, దీంతో ప‌క్కా వ్యూహంతో తైవాన్ పై చైనా దాడులు చేస్తుంద‌ని ట్రంప్ తెల్చిచెప్పారు.

ఇక ట్రంప్ వ్యాఖ్య‌లు చేసిన త‌ర్వాత నిజంగానే చైనా, తైవాన్ పై దాడుల‌కు దిగ‌నుందా అనే సందేహం ప్ర‌పంచ దేశాల్లో క‌లుగుతోంది. దీంతో అస‌లు చైనా, తైవాన్ మ‌ధ్య త‌గాదా ఏంట‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు. ఒక‌ప్ప‌డు చైనాలో అంత‌ర్భాగంగా ఉన్న తైవాన్, 1949లో వ‌చ్చిన అంత‌ర్యుద్ధం కార‌ణంగా చైనా నుంచి తైవాన్ విడిపోయింది. అప్ప‌టి నుంచి తైవాన్ ప్ర‌త్యేక ప్రాంతంగా ఉంటున్నా, చైనా మాత్రం ఈ చీలిక‌ను ఒప్పుకోవ‌డంలేదు. తైవాన్, చైనాలో అంత‌ర్భాగం అంటూ మొండిగా వాదిస్తూ.. చైనాలో విలీనం కావాలంటూ తైవాన్‌కు జిన్‌పింగ్ ప‌లుసార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఒక‌వైపు తైవాన్‌ను చైనా రెచ్చ‌గొడుతుంటే, చైనా దురాక్రమణకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదని తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ వెన్ హెచ్చరిస్తున్నారు.

అయితే ఇప్పటికిప్పుడు చైనా తైవాన్ పై దాడికి దిగే పరిస్థితులైతే లేవని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఉక్రెయిన్, ర‌ష్యాల మ‌ధ్య జ‌రుగుతున్న క్ర‌మంలో, సంద‌ట్లో స‌మేమియా అంటూ తైవాన్ పై చైనా వార్ ప్ర‌క‌టిస్తే, దాని ఫ‌లితాలు తీవ్రంగా ఉంటాయ‌ని చైనాకు తెలియందికాదు. ఎందుకంటే తైవాన్ పై దాడి చేస్తే, అంత‌ర్జాతీయంగా చైనా ఒంట‌ర‌య్యే పరిస్థితి వ‌స్తుంది.. మ‌రోవైపు తైవాన్ పై సానుభూతి పెరిగే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే క‌రోనా వ్యాప్తి ఇష‌యంంలో ప్ర‌పంచ‌దేశాలన్నీ డ్రాగెన్ దేశం పై గుర్రుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో తైవాన్ పై చైనా యుద్ధానికి దిగితే, అమెరికాతో పాటు ఇండియా కూడా తైవాన్‌కు సాయం చేసే అవ‌కాశం ఉంది. అలాగే ఆర్ధిక‌ప‌ర‌మైన ఆంక్ష‌ల‌ను కూడా చైనా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. దీంతో ర‌ష్యా,ఉక్రెయిన్ మ‌ధ్య త‌లెత్తిన ప‌రిస్థితుల‌వ‌లే, చైనా, తైవాన్‌ల మ‌ధ్య యుద్ధం జ‌రిగే అవ‌కాశం ఇప్ప‌ట్లో లేద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయప‌డుతున్నారు.