Site icon HashtagU Telugu

TMC MP : డాక్టర్‌ హత్యాచార ఘటన..టీఎంపీ ఎంపీకి సమన్లు

Doctor's murder incident.. Summons to TMP MP

Doctor's murder incident.. Summons to TMP MP

TMC MP Summoned By Cops: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన పై పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రే(MP Sukhendu Sekhar Ray)కు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ(Police issued summons) చేశారు. ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించి పలు ప్రశ్నలను ఎంపీ సుఖేందు లేవనెత్తారు. ఈ కేసుపై సీబీఐ న్యాయంగా వ్యవహరించాలని ఆయన కోరారు. తొలుత సూసైడ్‌ స్టోరీ చెప్పిన మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ కమిషనర్‌ను కస్టడీలో విచారించాలని డిమాండ్‌ చేశారు. హాల్ గోడను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. అలాగే సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత స్నిఫర్ డాగ్‌ను ఎందుకు ఉపయోగించారంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆయనను అధికార ప్రతినిధి పదవి నుంచి టీఎంసీ తొలగించింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, టీఎంసీ ఎంపీ సుఖేందు ఈ కేసు పట్ల తప్పుడు సమాచారం ప్రచారం చేశారని కోల్‌కతా పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయనకు సమన్లు జారీ చేశారు. అలాగే ఇదే తరహా ప్రశ్నలు లేవనెత్తిన బీజేపీ నాయకుడు లాకెట్ ఛటర్జీ, ఇద్దరు వైద్యులైన కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామికి కూడా పోలీసులు నోటీసులు పంపారు.

మరోవైపు ఈ కేసులో మరోమారు విచారణకు రావాలంటూ ఆర్జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు సిబిఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు మళ్లీ ఆయనను విచారిస్తున్న సిబిఐ అధికారులు ఈ కేసులో ఆయనను పదేపదే విచారించటం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఆర్జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను విచారిస్తున్న సీబీఐ ఇప్పటికే కోల్కత్తా వైద్యురాలిపై హత్యాచారం కేసులో 20 మందిని విచారించారు సీబీఐ అధికారులు . ఈ కేసులో ఇప్పటికే ఆగస్టు 16వ తేదీన 15 గంటల పాటు, ఆగస్టు 17వ తేదీన 13 గంటల పాటు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ ప్రశ్నించింది. మళ్లీ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఆయనను సిబిఐ ప్రశ్నిస్తోంది. వరుసగా మూడో రోజు ఆయనను విచారిస్తుంది.

Read Also: Jaishankar Kuwait Tour: కువైట్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్