Dolo 650: ప్రిస్క్రిప్షన్ రాసినందుకు డాక్టర్స్ కు వెయ్యి కోట్ల నజరానాలు.. ‘‘డోలో 650’’ దందాపై సుప్రీం ఆగ్రహం!!

కరోనా సమయంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ట్యాబ్లెట్ లో డోలో-650 ఒకటి.

Published By: HashtagU Telugu Desk
Medicine

Medicine

కరోనా సమయంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ట్యాబ్లెట్ లో డోలో-650 ఒకటి.

ఇంత భారీ సేల్స్ కు కారణం.. అప్పటి భారీ డిమాండ్ అని చాలామంది భావించారు. కానీ అసలు విషయం ఆలస్యంగా బయటపడింది.

డోలో-650ని ప్రిస్క్రైబ్ చేసినందుకు కొందరు డాక్టర్ల కు వెయ్యి కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారంటూ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇది చాలా తీవ్రమైన అంశం. కొవిడ్ సోకినప్పుడు నాకు కూడా వైద్యులు ఈ ట్యాబ్లెట్ నే సూచించారు” అని ఈసందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

10 రోజుల్లోగా అభిప్రాయం..

ఫార్మా కంపెనీలు నైతికంగా వ్యవహరించేలా చూడటం చాలా ముఖ్యమని పిల్లో మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీలు డాక్టర్లకు ముడుపులు అందించకుండా నిరోధించే చట్టమేమి లేదని తెలిపింది. ఈ వాదనలు విన్న ధర్మాసనం 10 రోజుల్లో తన అభిప్రాయం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మైక్రో ల్యాబ్స్ ఉత్పత్తి..

మైక్రో ల్యాబ్స్ అనే సంస్థ డోలో-650 మాత్రలను తయారు చేస్తోంది. 2020లో కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఆ కంపెనీ రికార్డు స్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లు విక్రయించింది. ఓకే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డాక్టర్లకు భారీగా ముడుపులిచ్చి  ..డోలో-650 టాబ్లెట్లను ప్రమోట్ చేసుకున్నారని ఇటీవల జరిగిన దర్యాప్తులో బయటపడింది.

  Last Updated: 18 Aug 2022, 11:30 PM IST