Site icon HashtagU Telugu

Doctor Murder Case: పిల్లలు ఉంటే తల్లి బాధ తెలిసేది: సీఎంపై బాధితురాలి తల్లి ఆవేదన

Doctor Murder Case

Doctor Murder Case

Doctor Murder Case: కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ ఆసుపత్రిలో దారుణానికి గురైన మహిళా డాక్టర్ తల్లి మళ్లీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడిన విధానం చాలా బాధ కలిగించిందని, మా కుటుంబానికి న్యాయం జరగడం లేదని, దేశం మొత్తం మా కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారని, మాకు న్యాయం జరగదన్నారు. మమతా బెనర్జీకి కొడుకు, కూతురు లేరని అన్నారు. దీంతో బిడ్డను పోగొట్టుకున్న బాధను ఆమె అర్థం చేసుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలి కుమార్తెకు న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న వారిని ఉద్దేశించి సీఎం మమతా బెనర్జీ మాట్లాడిన మాటల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు డాక్టర్ తల్లి. సీఎం స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మా బాధను ఎవరికీ వివరించలేము. ప్రపంచం మొత్తం నా కూతురికి అండగా నిలుస్తోందని తెలిపారు. అయితే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, మాకు న్యాయం చేయాలని కోరుతున్న వారికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతామని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. వారికి ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తామన్నారు. అంతకుముందు సీఎం మమతా సమ్మె చేస్తున్న డాక్టర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నిందితులకు మరణశిక్ష పడేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అయితే డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆమె కోరారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

డాక్టర్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మాకు మొదటి నుండి డిపార్ట్‌మెంట్ (ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్)పై అనుమానం ఉంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం మొదటి నుంచి తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వారు మాకు చాలా ఆలస్యంగా తెలియజేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసులో పోలీసుల పని తీరు సంతృప్తికరంగా లేకపోవడంతో హైకోర్టుకు వెళ్లగా కోర్టు కేసును సీబీఐకి అప్పగించింది.

Also Read: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

 

Exit mobile version