kolkata : డాక్టర్‌ హత్యాచారం కేసు..ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపాల్‌కు బెయిల్‌

మెడికల్‌ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన జైలులోనే ఉండనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Doctor murder case..Bail for ex-principal of RG Kar

Doctor murder case..Bail for ex-principal of RG Kar

kolkata : కోల్‌కతా లేడీ డాక్టర్‌ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చట్టం ప్రకారం 90 రోజుల వ్యవధిలో ఛార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున బెయిల్ మంజూరు చేయబడింది. అయితే మెడికల్‌ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన జైలులోనే ఉండనున్నారు.

కాగా, పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్ట్‌ 9న నైట్‌ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌తోపాటు కేసు నమోదులో ఆలస్యం వహించిన పోలీస్‌ అధికారి అభిజిత్ మోండల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. నాటి నుంచి రిమాండ్‌ నిమిత్తం జైలులో ఉన్న వీరిద్దరికి సీల్దా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడిన మోండల్ న్యాయవాది, అతను జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచబడిన కరెక్షనల్ హోమ్ నుండి త్వరలో విడుదల అవుతాడని పేర్కొన్నాడు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని ఘోష్‌పై ఆరోపణలు వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం-హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఈ కేసుకు సంబంధించి మోండల్ మరియు ఘోష్ ఇద్దరినీ అరెస్టు చేసింది.

Read Also: Red Fort : ఎర్రకోటను తమకు అప్పగించలంటూ మొఘల్‌ వారసుల పిటిషన్‌

  Last Updated: 13 Dec 2024, 07:06 PM IST