Site icon HashtagU Telugu

Dengue: డెంగ్యూ వ్యాధితో డాక్టర్ మృతి

Dengue

Logo (8)

Dengue: దేశంలోని అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూతో ఇప్పటి వరకు 20 కి పైగానే మృతి చెందారు. అయితే తాజాగా ఓ వైద్యడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. డెంగ్యూతో బాధపడుతున్న 28 ఏళ్ల వైద్యుడు శుక్రవారం కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో మరణించాడు. డెంగ్యూ హెమరేజ్ షాక్ సిండ్రోమ్ కారణంగా అతను తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. వైద్యుడి మృతితో ఈ ఏడాది మృతుల సంఖ్య 25కి చేరింది.

వైద్యం చేయాల్సిన వైద్యుడే మృతి చెందితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఆందోళనకరంగా మారింది.కోల్‌కతా చుట్టుపక్కల జిల్లాల్లో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డెంగ్యూ వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో గత వారంలో డెంగ్యూ కారణంగా ఐదుగురు మృతి చెందారు.

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ప్రజలు వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు తమ ఇళ్ల దగ్గర నీరు చేరకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి శరీరం నిండా దుస్తులు ధరించాలి. ఎవరైనా జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు లేదా తీవ్రమైన తలనొప్పి అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఉత్తరప్రదేశ్‌లో డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో 72 మందికి డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డెంగ్యూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ విజ్ఞప్తి చేస్తోంది. జ్వరం, విపరీతమైన తలనొప్పి వంటి సమస్యలు చాలా రోజులుగా ఉంటే వెంటనే డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాలని సీఎంవో డాక్టర్ ఎంకే అగర్వాల్ సూచించారు.

Also Read: Election Drugs : ఎన్నిక‌ల‌ ముందు `డ్ర‌గ్స్` కేసులు తెర‌పైకి..!

Exit mobile version