Most Wanted Criminals : తహవ్వుర్ హుస్సేన్ రాణా.. 2008లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రదాడుల కేసులో దోషి. ఈవిషయాన్ని ఏకంగా అమెరికా సుప్రీంకోర్టు తేల్చింది. ఎంతో అమాయక భారతీయుల ప్రాణాలు పోయేందుకు కారకుడైన ఆ కర్కశుడిని, ముష్కరుడిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఈనేపథ్యంలో భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న టాప్-5 నేరగాళ్ల చిట్టాను ఈ కథనంలో చూద్దాం..
Also Read :Sky Force Vs Kodava Community : ‘స్కై ఫోర్స్’ మూవీపై కొడవ వర్గం భగ్గు.. కారణం ఇదీ
ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా
విజయ్ మాల్యా కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది. ఇతగాడు భారతదేశ బ్యాంకులకు(Most Wanted Criminals)దాదాపు రూ.9వేల కోట్ల అప్పులను ఎగవేసి, విదేశాలకు పారిపోయాడు. 2016 సంవత్సరంలో విజయ్ మాల్యా భారత్ నుంచి యూకేకు వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడు. తాను ఉండటానికి ఒక పేద్ద భవనాన్ని కొన్నాడు. తన కుమారుడి పెళ్లిని కూడా బ్రిటన్‌లోనే జరిపించాడు. బ్రిటన్ దేశం భారత్‌తో సత్సంబంధాలను కలిగి ఉన్నామని బుకాయిస్తూనే.. మాల్యా లాంటి కేటుగాళ్లకు ఆశ్రయం కల్పిస్తుండటం ఆందోళనకరం. బ్రిటన్ నుంచి భారత్‌కు మాల్యాను తీసుకొచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు బాగానే ప్రయత్నాలు చేస్తోంది. అలుపెరుగని న్యాయపోరాటం చేస్తోంది. త్వరలోనే మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఆర్థిక ఉగ్రవాది నీరవ్ మోడీ
నీరవ్ మోడీ సైతం కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది. ఇతగాడు విజయ్ మాల్యాను మించిన రేంజులో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడు. దాదాపు రూ.14వేల కోట్ల రుణాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు ఎగ్గొట్టాడు. 2018లో భారత్ విడిచి నీరవ్ పరారయ్యాడు. ప్రస్తుతం యూకేలోని ఒక జైలులో ఉన్నాడు. ఇతగాడిని 2018లోనే లండన్‌లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు లోన్ డబ్బులు ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోడీ, అతడి మామ మోహుల్ చోక్సీలు కీలక నిందితులు. మోహుల్ చోక్సీ కూడా భారత్ నుంచి పరారయ్యాడు. ఇతడు ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉంటున్నాడు. త్వరలో నీరవ్ మోడీని భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది.
అన్మోల్ బిష్ణోయ్
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడే అన్మోల్ బిష్ణోయ్. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. ఆ జైలు నుంచే అతగాడు తన గ్యాంగును నడుపుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ కొన్నాళ్లు కెనడాలో, కొన్నాళ్లు అమెరికాలో ఉండేవాడు. జైల్లో ఉన్న లారెన్స్ నుంచి వచ్చే సందేశం ఆధారంగా అన్మోల్ అలర్ట్ అయ్యేవాడు. భారత్‌లో తమ షూటర్ల ముఠాను పురమాయించి హత్యలు, సెటిల్మెంట్లు చేయించేవాడు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీల హత్యలతో సహా పలు కీలక కేసులతో అన్మోల్‌కు సంబంధం ఉంది. అతడిని 2024 నవంబరులో అమెరికాలో అరెస్ట్ చేశారు. ట్రంప్ ఓకే అంటే .. అన్మోల్ అమెరికా నుంచి భారత్‌కు చేరుతాడు.
అర్ష్ దల్లా
భారత ప్రభుత్వాన్ని, భారత సార్వభౌమాధికారాన్ని, భారత భూభాగాన్ని వ్యతిరేకించడమే ఖలిస్తానీ ఉగ్రవాదుల పని. అలాంటి ఖలిస్తానీ ఉగ్ర సంస్థలకు కెనడా, అమెరికా దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయి. భారత్ ఒకవేళ భవిష్యత్తులో రష్యాకు అనుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే.. వాటిని భారత్‌పైకి ఉసిగొల్పాలనేది అమెరికా స్కెచ్. అందులో భాగంగానే ఖలిస్తానీ ఉగ్రసంస్థల ముఖ్యనేతలకు అమెరికా ఆశ్రయం, భద్రత, పౌరసత్వం కల్పిస్తోంది. అర్ష్ దల్లా కూడా ఖలిస్తానీ ఉగ్రవాదే. ఇతడి మరోపేరు అర్ష దీప్ సింగ్ గిల్. భారత్‌లో జరిగిన దాదాపు 50కిపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఉగ్రవాద చర్యల కేసుల్లో అర్ష్ దల్లా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నుంచి ఇతడికి ఫండింగ్ అందేది. కెనడాలో ఉంటూ భారత్‌లో ఖలిస్తానీ ఉగ్ర కార్యకలాపాలను నడుపుతున్న ఇతగాడిని 2024 అక్టోబరులో అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబరులో 30వేల డాలర్ల ష్యూరిటీ బాండ్‌ను సమర్పించి అర్ష్ దల్లా బెయిల్ పొందాడు.
Also Read :Bill Gates Regret : మెలిండాకు విడాకులపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు
తహవ్వుర్ హుస్సేన్ రాణా
తహవ్వుర్ హుస్సేన్ రాణా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు. 2008లో జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో 160 మందికిపైగా భారతీయులు చనిపోయారు. ఈ దాడి వెనుక పథక రచన చేసిన ముఖ్య ఉగ్రవాదుల్లో తహవ్వుర్ ఒకడు. ఇతడు గతంలో పాకిస్తాన్ ఆర్మీలో వైద్యుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. 2009లో డెన్మార్‌లో ఉగ్రవాద కుట్రకు పాల్పడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు తహవ్వుర్‌ను అరెస్టు చేశారు. డెన్మార్క్‌లో ఉగ్రదాడి కోసం లష్కరే తైబాకు సాయం చేశాడనే అభియోగాలతో అతడికి జైలుశిక్ష విధించారు. తహవ్వుర్ రాణాను డెన్మార్క్ నుంచి అమెరికాకు అప్పగించారు. అక్కడి కోర్టు అతడిని చాలా ఏళ్లు విచారించింది. ముంబైలో జరిగిన ఉగ్రదాడితో తహవ్వుర్‌కు లింకులు ఉన్నట్లు గుర్తించారు. భారత్ కూడా అందుకు సంబంధించిన ఆధారాలను అమెరికా కోర్టులకు అందించింది. అందువల్లే అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టాలని అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.