జమ్మూ కశ్మీర్‌లో పహెల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి అనంతరం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. భారత ప్రభుత్వం తక్షణమే ప్రతీకార చర్యలు తీసుకొని పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీనితో పాకిస్తాన్ మళ్లీ యుద్ధ భయం కలిగించే అణుబాంబు బెదిరింపులకు పాల్పడింది. అయితే భారత్ ఇప్పటికే అత్యాధునిక ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో అణు ఆయుధాల బలంతో ఎవరెంత శక్తివంతంగా ఉన్నారు అనే అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన అణుబాంబు అమెరికా వద్ద ఉంది. B61-12 మోడల్‌గా గుర్తింపబడిన ఈ అణుబాంబు ధర అంచనా ప్రకారం 28 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 230 కోట్లు). ఇది అత్యంత దృఢమైంది. లక్ష్యాన్ని ఛేదించగలిగే ఆధునిక బాంబుగా ఇది గుర్తింపు పొందింది. ఈ బాంబును ప్రయోగించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన విమానాలు, ప్రయోగ వేదికలు అవసరం. ఇది తక్కువ బరువుతో ఎక్కువ విధ్వంసానికి కారణమయ్యే విధంగా రూపుదిద్దబడిన అణు ఆయుధం.
Delhi High Alert : దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్..ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
ప్రపంచంలో తొమ్మిది దేశాలు మాత్రమే ఈ అణు ఆయుధాలను కలిగి ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా. ఆయుధ నియంత్రణ సంస్థల ప్రకారం.. భారతదేశం వద్ద సుమారు 180 అణు ఆయుధాలు, పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి. ఇవి గణాంకాల ప్రకారం సమాన స్థాయిలో ఉన్నా, వ్యవస్థలు, ప్రయోగ సామర్థ్యం, రక్షణ కవచాల పరంగా భారత్ స్థానం బలంగా ఉంది. ఒక్క అణుబాంబు తయారీకి దాదాపు రూ. 152 కోట్లు నుంచి రూ. 447 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఇది ఆయుధ బరువు, ద్రవ్య లోహాల పరిమాణం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.