Advance Tax – December 15 : అడ్వాన్స్ ట్యాక్స్ పే చేశారా? డిసెంబరు 15 లాస్ట్ డేట్

Advance Tax - December 15 : రాబోయే ఆదాయాన్ని అంచనా వేసి ముందస్తుగా చెల్లించే పన్నునే ‘అడ్వాన్స్ ట్యాక్స్’ అంటారు.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 02:13 PM IST

Advance Tax – December 15 : రాబోయే ఆదాయాన్ని అంచనా వేసి ముందస్తుగా చెల్లించే పన్నునే ‘అడ్వాన్స్ ట్యాక్స్’ అంటారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు లాస్ట్ డేట్ డిసెంబర్ 15. ఒకవేళ ఈ తేదీలోగా ‘అడ్వాన్స్ ట్యాక్స్’ పేమెంట్ చేయకుంటే భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. ‘అడ్వాన్స్ ట్యాక్స్’‌ను ఒకేసారి సంవత్సరం చివరన కాకుండా.. దశల వారీగా పే చేయొచ్చు. అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ట్యాక్స్ రూ.10 వేలు అంత కన్నా ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స్‌ను కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు కూడా దీన్ని పే చేయాలి. ఉద్యోగుల విషయానికి వస్తే యాజమాన్యాలు శాలరీల నుంచి ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్)‌ను డిడక్ట్ చేస్తాయి. కాబట్టి ఉద్యోగులు మళ్లీ సెపరేటుగా ‘అడ్వాన్స్ ట్యాక్స్’‌ను పే చేయాల్సిన అవసరం ఉండదు.

We’re now on WhatsApp. Click to Join.

  • రాబోయే ఆర్థిక సంవత్సరంలో తమకు వచ్చే ఆదాయపు అంచనాపై అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంచనా ఆదాయంలో నుంచి డిడక్షన్స్, ఎగ్జెంప్షన్స్ తీసివేస్తే వచ్చేదే పన్ను చెల్లించాల్సిన ఆదాయం. వ్యక్తులు లేదా కార్పొరేట్ ట్యాక్స్ చెల్లించే వ్యాపార సంస్థలకు ఈ ఆదాయాన్ని బట్టి పన్ను స్లాబులు ఉంటాయి.
  • బిజినెస్ చేసే వారు తప్పనిసరిగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ ట్యాక్స్‌‌‌గా కొంత మొత్తాన్ని అంచనా వేస్తున్నారు.  అడ్వాన్స్ ట్యాక్స్‌‌‌‌లో 15 శాతాన్ని తొలివిడతగా జూన్ 15లోగా పే చేయాలి. రెండో విడతలో సెప్టెంబర్ 15లోగా 45 శాతం, మూడో విడతలో డిసెంబర్ 15లోగా 75 శాతం  అడ్వాన్స్ ట్యాక్స్‌ను కట్టాలి. ఆ తర్వాత మార్చి 15లోగా 100 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ ‌ను చెల్లించాలి.
  • ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్‌ను డిసెంబరు 15లోగా చెల్లించకుంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234సీ ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్‌‌లో 1 శాతానికి సమానమైన మొత్తాన్ని వడ్డీగా కలిపి కట్టాల్సి ఉంటుంది.
  • సెక్షన్ 234బీ ప్రకారం.. ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరి వరకు (2024  మార్చి)  అడ్వాన్స్ ట్యాక్స్‌ను చెల్లించకుంటే బకాయి ఉన్న మొత్తంపై నెలకు 1 శాతం వడ్డీని విధిస్తారు.
  • అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఐటీ విభాగం ఇ-పేమెంట్ పోర్టల్ లేదా అధికారిక బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. సంబంధిత బ్యాంక్ బ్రాంచుల్లో ఛాలాన్ ద్వారా ఆఫ్‌లైన్ పేమెంట్ కూడా(Advance Tax – December 15) చేయవచ్చు.

Also Read: LPG Cylinder – Biometric : వంటగ్యాస్ కనెక్షన్ ‘బయోమెట్రిక్ అప్‌డేట్’ ఇక ఈజీ