RBI New Rules : ఆర్బీఐ నిర్ణయంతో రూ.లక్ష లోన్ పై ఈఎంఐ ఎంత పెరుగుతుందో తెలుసా?

ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీంతో లోన్ల కోసం ఈఎంఐలు కట్టేవారికి సమస్యలు తప్పడం లేదు. రె

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 05:00 PM IST

ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీంతో లోన్ల కోసం ఈఎంఐలు కట్టేవారికి సమస్యలు తప్పడం లేదు. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లను పెంచింది. దీనివల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఈ పరిణామాలతో గృహ వినియోగదారులకు ఈఎంఐ మరింత భారం కానుంది. అంటే రూ.లక్ష లోన్ పై వారు కట్టాల్సిన మొత్తం పెరుగుతుంది.

20 ఏళ్ల కాలపరిమితితో 7 శాతం వడ్డీతో రూ.25 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే.. వాళ్లకు నెలకు ఈఎంఐ రూ.19,382 పడుతుంది. ఇప్పుడు రెపోరేటు పెరగడంతో అదనంగా మరో రూ.1,374 భారం పడుతుంది. అంటే మొత్తం నెలకు కట్టాల్సిన ఈఎంఐ రూ.20,756 అవుతుంది. ప్రతీ రూ.లక్ష లోన్ కు రూ.55 చొప్పున గృహ వినియోగదారులు చెల్లించక తప్పదు.

ఒక వ్యక్తి ఏడేళ్ల కాలపరిమితితో 10 శాతం వడ్డీతో రూ.10 లక్షల వాహన రుణం తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు నెలవారీ ఈఎంఐ మామూలుగా అయితే రూ.16,061 పడుతుంది. కానీ రెపోరేటు పెంపుతో అదనంగా రూ.469 చెల్లించాలి. అంటే మొత్తంగా ఆ వ్యక్తి నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.14,242 అవుతుంది. రుణం తీసుకున్న వాహనదారులు ఈ భారం మోయక తప్పదు.

వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారికీ భారం తప్పదు. ఐదేళ్ల కాలపరిమితితో 14 శాతం వడ్డీ రేటుతో రూ.6 లక్షల రుణం తీసుకుంటే.. దానికి ఈఎంఐ రూ.13,961 అవుతుంది. కానీ ఇప్పుడు రెపోరేటు పెంపుతో అదనంగా ఒక్కో ఈఎంఐపైన రూ.281 అదనంగా చెల్లించాలి. అంటే మొత్తంగా నెలకు ఈఎంఐ కింద రూ.14,242 చెల్లించాలి.