Modi: మోదీ విదేశీ ఖర్చు ఎంతో తెలుసా?.. షాక్ ఇస్తున్న లెక్కలు!

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుండి భారత విదేశాంగ విధానం భారీగా మారింది.

  • Written By:
  • Updated On - February 2, 2023 / 09:23 PM IST

Modi: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుండి భారత విదేశాంగ విధానం భారీగా మారింది. భారతదేశానికి ఇతర దేశాలతో మంచి సంబంధాలు నెలకొన్నాయి. ప్రపంచం దృష్టిలో భారతదేశాన్ని చూసే విధానం కూడా బాగా మారిపోయింది. దీనికి కారణం ప్రధానిగా మోదీ, విదేశాంగ మంత్రులు విదేశాలతో నెరుపుతున్న స్నేహబంధాలు. అయితే మోదీ విదేశీ పర్యటనల మీద మరోసారి వివాదం రాజుకుంది.

దేశంలో కోట్ల మంది కష్టపడుతుంటే.. ప్రధాని హోదాలో మోదీ మాత్రం జాలీగా విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ చాలాకాలంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తుండటం తెలిసిందే. అయితే తాజాగా మోదీ చేసిన విదేశీ పర్యటనల లెక్కలు పార్లమెంట్ లో చర్చకు వచ్చాయి. 2015 నుండి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 58సార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు పార్లమెంట్ లో విదేశాంగ శాక సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంట్ లో తెలిపారు.

2015 నుండి ప్రధాని మోదీ ఇప్పటి వరకు 58 సార్లు విదేశాల్లో పర్యటిస్తే.. మొత్తం రూ.517.82 కోట్లు ఖర్చు అయినట్లు పార్లమెంట్ లో మంత్రి మురళీధరన్ వెల్లడించారు. 2015-16లో రూ.121.85 కోట్లు, 2016-17లో రూ. 78.52కోట్లు, 2017-18లో రూ. 99కోట్లు, 2018-19లో రూ.100.02కోట్లు, 2019-20లో రూ.46.23కోట్లు ఖర్చు అయినట్లు మంత్రి పార్లమెంట్ లో వివరించారు. ఇక గత నాలుగేళ్లలో మోదీ మూడుసార్లు జపాన్, రెండుసార్లు అమెరికా, రెండుసార్లు యూఏఈ పర్యటించినట్లు వెల్లడించారు.

ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యపు అంచుల్లో ఉన్న సమయంలో మన దేశ ప్రధాని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రతిపక్ష పార్టీలు దీనిపై ప్రశ్నిస్తున్నాయి. అటు విదేశాంగ మంత్రి జైశంకర్ నాలుగేళ్లలో అధికారికంగా 86 పర్యటనలు చేయగా.. వీటికై రూ.20.87కోట్లు ఖర్చైనట్లు మురళీధరన్ తెలిపారు. ఇక రాష్ట్రపతి 8 అధికారిక పర్యటనలు చేయగా.. రూ.6.24 కోట్లు ఖర్చైనట్లు పార్లమెంట్ లో వెల్లడించడం జరిగింది.