Independence Day 2023 : ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎన్ని కెమెరాలతో టెలికాస్ట్ చేస్తారో తెలుసా? వామ్మో.. ఇన్ని కెమెరాలా?

ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రసార భారతి ద్వారా దేశమంతా వివిధ ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ చేస్తారని తెలిసిందే. ఈ వేడుకల్ని టెలికాస్ట్ చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Published By: HashtagU Telugu Desk
Independence Day

Independence Day

రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు(Independence Day)ఢిల్లీ(Delhi) ఎర్రకోట(Red Fort) సిద్ధమైంది. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట వేదికగా ఘనంగా జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) నాయకత్వంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ఎర్రకోట సిద్ధమైంది. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట వేదికగా ఘనంగా జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

అయితే ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రసార భారతి ద్వారా దేశమంతా వివిధ ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ చేస్తారని తెలిసిందే. ఈ వేడుకల్ని టెలికాస్ట్ చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను లైవ్ టెలికాస్ట్ చేయడానికి మొత్తం 41 కెమెరాలని వాడనున్నారు. అందులో 36 కెమెరాలు ఎర్రకోట వద్ద, 5 కెమెరాలు రాజ్‌ఘాట్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో 5 రోబోటిక్ కెమెరాలు అందులో డ్రోన్ కెమెరాలు కూడా ఉండనున్నాయి. అలాగే రెండు 360-డిగ్రీ కెమెరాలు ఉండనున్నాయి. డైనమిక్ కెమెరా యాంగిల్స్ ఇవ్వడానికి జిమ్మీ జిబ్స్‌పై 4 కెమెరాలు ,సిజర్ క్రేన్‌పై ఒక కెమెరా ఏర్పాటు చేయనున్నారు. రేపు ఉదయం 6:15 గంటలకు ఎర్రకోట నుంచి ప్రసారం ప్రారంభమవుతుంది.

 

Also Read : Independence day : ఆగస్టు 15 న ఇండియా తో పాటు మరో నాల్గు దేశాల్లో స్వాతంత్య్ర వేడుకలు

  Last Updated: 14 Aug 2023, 08:11 PM IST