సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రోజు రోజుకు రెచ్చిపోతున్నారు..సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్లలో లింక్స్ పంపించి..వాటిని క్లిక్ చేయగానే వారి బ్యాంకు ఖాతాల్లో నుండి డబ్బును కొట్టేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన (Praja Palana) పేరుతో నేరగాళ్లు..ఫోన్లు చేసి మీరు ఆరు గ్యారెంటీలకు అర్హత పొందారని చెప్పి OTP నెంబర్లు అడిగి బ్యాంకు ఖాతాల్లో నుండి డబ్బు లాగేసారు. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంబోత్సవాన్ని (Ayodhya Ram mandir Opening) ఆసరాగా చేసుకొని మోసాలకు తెరలేపారు. రామ్ మందిరం లైవ్ అని చెప్పి ఫోన్లకు లింక్స్ పంపిస్తూ..వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నుండి డబ్బులు లాగేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేయడం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘అయోధ్య లైవ్’ పేరిట వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల లైవ్ అంటూ, విశేషాలంటూ.. ఇలా వేర్వేరు పేర్లతో లింక్‌లు పంపుతూ సైబర్ నేరస్థులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉన్నదని, ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్ లింక్‌లను, మెయిల్స్ ను ఓపెన్ చేయొద్దంటూ సూచించారు. మరోపక్క కేంద్రం సైతం అలర్ట్ జారీచేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి వార్తల ప్రసారం, సమాచారం ప్రచురణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవాలని సూచించింది. ముఖ్యంగా సోషల్ మీడియా లో రెచ్చగొట్టే, నకిలీ సందేశాలు విస్తృతంగా వ్యాప్తి చెందడాన్ని గుర్తించామని, ఇవి మత సామరస్యాన్ని, శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని కేంద్ర ఐటీ, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
Read Also : Shri Ram Lalla Virajman : అయోధ్య ఆలయంలో కొత్త విగ్రహ స్థాపనపై శంకరాచార్య అభ్యంతరం