CM Stalin: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఈరోజు డీఎంకే. జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలకులతో ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు 72 జిల్లాల కార్యదర్శులు, 234 నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే 40 స్థానాలకు గానూ 40 స్థానాల్లో విజయం సాధించాలని స్టాలిన్ చెప్పారు. ప్రతి ప్రాంతంలో పోలింగ్ ఏజెంట్లను నియమించినప్పటికీ ప్రతి జిల్లా కార్యదర్శులు ఇందుకోసం శ్రమించాలని కోరారు. అప్పగించిన పనులను చక్కగా నిర్వహించి విజయానికి కృషి చేయాలన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన దానికంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత కష్టపడి 40కి 40 నియోజకవర్గాల్లో విజయం సాధించాలి. అందుకోసం కష్టపడాలని సీఎం సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి అందుకు తగ్గట్టు పని చేసేందుకు సమయం ఉన్నదని, ఇందుకోసం సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. నియోజకవర్గ పరిశీలకులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో జరిగే సమావేశాలకు తప్పకుండా హాజరై పార్టీ కార్యవర్గ నిర్వాహకులకు తగిన సలహాలు ఇవ్వాలన్నారు. పార్టీ సిట్యువేషన్ ను ఎప్పటికప్పుడు నాయకత్వానికి నివేదించాలని అన్నారు.
Also Read: Telangana: నిర్మల్ లో రూ.1,157 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన