Site icon HashtagU Telugu

Himachal Crisis: క్రాస్ ఓటింగ్ తో అలర్ట్ అయిన కాంగ్రెస్.. సిమ్లాకు డీకే

Himachal Crisis

Himachal Crisis

Himachal Crisis: హిమాచల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అక్కడ రాజకీయ గందరగోళంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అత్యవసర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో తదితర వివరాలను పంచుకున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు హిమాచల్‌లో కాంగ్రెస్‌ సుఖు ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు డీకే శివకుమార్, భూపేంద్ర సింగ్ హుడాలను హైకమాండ్ సిమ్లాకు పంపింది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, హర్యానా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడా సిమ్లా రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేయనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో మాట్లాడి ఫిర్యాదులు వినాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యేల సమస్యను త్వరగా పరిష్కరించి.. నివేదికను త్వరలో అందజేస్తామని చెప్పారు. జైరాం రమేష్ ఇంకా మాట్లాడుతూ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ముందు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కమలంను ఎదుర్కోవడానికి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఇతర నాయకులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పారు.

Also Read: Varun Tej: ఆ హైట్ హీరో టాలీవుడ్ లో ఎవరూ లేరు.. ఇందంతా కుట్ర: వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్?