DK Shivakumar : కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్..

డీకే శివకుమార్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. వెంటనే అల్లావుద్దీన్ మనియార్ చెంపపై కొట్టాడు

Published By: HashtagU Telugu Desk
Dk Shivakumar Allegedly Sla

Dk Shivakumar Allegedly Sla

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో పాల్గొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar).. తన భుజంపై చేయి వేసిన ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ చిన్న అవకాశం వచ్చిన వదులుకోవద్దని చూస్తున్నారు. ఎవరు ఏ తప్పు చేసిన దానిని జనాల్లోకి తీసుకెళ్లి తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు శివ కుమార్ చేసిన దానిని కూడా బిజెపి నేతలు అలాగే క్యాష్ చేసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 26వ తేదీన 14 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా.. మిగిలిన 14 స్థానాలకు ఈ నెల 7 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హావేరీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వినోదా అసూటికి మద్దతుగా డీకే శివకుమార్ ప్రచారానికి వెళ్లారు. డీకే శివకుమార్‌కు స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ కారు దిగి వస్తుండగా స్థానిక కాంగ్రెస్ నేత, మున్సిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్.. అనుకోకుండా ఆయన భుజంపై చేయి వేశాడు. దీంతో డీకే శివకుమార్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. వెంటనే అల్లావుద్దీన్ మనియార్ చెంపపై కొట్టాడు. అంతేకాకుండా అతడ్ని డిప్యూటీ సీఎం పక్కకు నెట్టేశారు. అది గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది కూడా అల్లావుద్దీన్‌ మనియార్‌ను వెనక్కి తోశారు. ఈ సంఘటనతో అల్లావుద్దీన్ మనియార్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిని బిజెపి నేతలు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ..ఇది కాంగ్రెస్ నైజంఅంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Bomb threats : అహ్మదాబద్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

  Last Updated: 06 May 2024, 01:36 PM IST