Site icon HashtagU Telugu

Apsara A Diplomat : ‘అప్సర’ వేషధారణలో ఎవరో తెలుసా ?

Apsara A Diplomat

Apsara A Diplomat

Apsara A Diplomat : పైన ఫొటో చూశారు కదా.. అందులో స్టిల్స్ ఇస్తున్నది ఎవరో మోడల్ కాదు !! కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే ఈ విధంగా కంబోడియన్ దుస్తులలో స్పెషల్ లుక్‌లో కనిపించారు. ‘అప్సర’ వేషధారణలో ఆమె జిగేల్మన్నారు. ఈ ఫొటోలను తాజాగా కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. కంబోడియా నూతన సంవత్సరం ‘ఖైమర్’ సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ  సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకు ఈ ఫొటోలను  దేవయాని ఖోబ్రోగాడే జతపరిచారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రాచీన ఖైమర్ సంస్కృతి,  సంప్రదాయం పట్ల తనకున్న ప్రగాఢమైన అభిమానాన్ని చాటుకునేందుకే అప్సర వేషధారణలో ఫొటోలు దిగానని దేవయాని తెలిపారు.  కంబోడియా ప్రజలంతా ఖైమర్ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.పురాతన ఖైమర్ పురాణాలలో ప్రస్తావించిన విధంగా సంప్రదాయ బంగారు ఆభరణాలు,  దుస్తులు,  తలపాగాను దేవయాని ధరించి అప్సర (Apsara A Diplomat) వేషధారణలో అబ్బురపరిచారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 13 లేదా 14వ తేదీలో కంబోడియాలో ఖైమర్ నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసందర్భంగా అక్కడ మూడు రోజుల ప్రభుత్వ సెలవుదినాలను ప్రకటిస్తారు. కంబోడియాలో పంట సీజన్ ముగిసి..  వర్షాకాలం త్వరలోనే ప్రారంభం అవుతుందనే మెసేజ్‌ను ఈ పండుగ అందిస్తుంది.

Also Read :BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో రిలీజ్.. ప్ర‌ధాని మోదీ ఇచ్చిన హామీలివే..!

కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే 1999 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. దాదాపు 24 ఏళ్ల కెరీర్‌లో ఆమె బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారతీయ మిషన్లలో పనిచేశారు. అంతకుముందు ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలోని PAI విభాగం (పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్), సెంట్రల్ యూరప్ విభాగం, ఫైనాన్స్ అండ్ CPV విభాగం (కాన్సులర్ పాస్‌పోర్ట్, వీసా)లలోనూ దేవయాని పనిచేశారు.

Also Read :Birth Date Vs Business : ఈ తేదీల్లో పుట్టినవారు.. వ్యాపారంలో దూసుకుపోతారు !!