Sharad Pawar: పవార్ పవర్ తగ్గింది: దిలీప్ ఘోష్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి

Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ నిర్ణయంపై అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు పవార్ నిర్ణయంపై రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో అతి త్వరలో పెను మార్పు జరగబోతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అంచనా వేశారు. ఎన్సీపీ ఉనికి ప్రమాదంలో పడిందని భావిస్తున్నాను. మిస్టర్ పవార్ పవర్ తగ్గుతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి అని ఆయన అన్నారు.

శరద్ పవార్ రాజీనామా తర్వాత పార్టీ నేతలు రాజీనామాను ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు పార్టీ కార్యకర్తలు. తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులతో గళం విప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకోవాలని పార్టీ సీనియర్ నేతలు కోరారు. కార్యకర్తల అభ్యర్థన మేరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు రెండు మూడు రోజుల సమయం కావాలని కోరారు

82 ఏళ్ల పవార్ తన జీవితకథ ‘లోక్ మాఝే సంగతి’ ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా మే 1, 1960 నుండి మే 1, 2023 వరకు తన 63 సంవత్సరాల ప్రజా జీవితంలోని ఎత్తుపల్లాలను పవార్ గుర్తు చేసుకున్నారు. అదే క్రమంలో అందరికీ షాక్ ఇస్తూ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను అని.. దీంతో పాటు పార్టీ సీనియర్ నేతలతో కమిటీ వేసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పవార్ సూచించారు.

Read More: MI vs PBKS: ముంబైతో పంజాబ్‌ కీలక పోరు.. మొహాలీ వేదికగా ఆసక్తికర మ్యాచ్‌..!