Site icon HashtagU Telugu

Akbaruddin: అక్బర్ కు మద్దతుగా రవీనా టాండన్.. ఎవరినైనా ఆరాధించే స్వేచ్ఛ అందరికీ ఉందంటూ నెటిజన్ కు చురక

Owaisi Raveena

Owaisi Raveena

మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు స‌మాధిని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల సందర్శించడం పై దుమారం రేగుతోంది. అక్బ‌రుద్దీన్ మ‌హారాష్ట్ర‌లో టూర్ చేయ‌డాన్ని శివ‌సేన‌, బీజేపీలు త‌ప్పుప‌ట్టాయి. ఈనేపథ్యంలో అక్బ‌రుద్దీన్ కు మద్దతు గా హీరోయిన్ రవీనా టాండన్ స్పందించారు. “గురు తేజ్ బహదూర్, శంభాజీ మహరాజ్ లను చంపిన హంతకుడిని .. కాశీ ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగుడుని.. 49 లక్షల మంది హిందువుల ప్రాణాలు తీసిన కర్కశుడికి పూజలు చేయడం, గౌరవించడం దారుణం” అని ట్విటర్ వేదికగా ఒక నెటిజన్ చేసిన కామెంట్ కు రవీనా స్పందించారు.

“మనం సహనానికి మారుపేరు. గతంలో.. ఇప్పుడు.. ఎప్పుడూ మనం సహనంతోనే ఉంటాం. ఇది స్వేచ్ఛ కలిగిన దేశం. ఇక్కడ ఎవరినైనా ఆరాధించవచ్చు. ఒక వేళ మీకు ఆ హక్కులు ఉంటే.. ఇతరులకూ అదే విధమైన హక్కులు ఉంటాయి” అని రవీనా ఆ నెటీజన్ కు ఘాటుగా, సూటిగా బదులిచ్చారు.