President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

టీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్‌పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు.

Published By: HashtagU Telugu Desk
President Trump

President Trump

President Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Trump) భారత్‌తో సంబంధాలను మరింత దెబ్బతీసేలా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆయన క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ ఇనిషియేటివ్‌ను ప్రకటించారు. ఈ చొరవలో QUAD మిత్రదేశాలైన జపాన్ఆ, స్ట్రేలియాలను చేర్చారు. కానీ భారత్‌కు మాత్రం స్థానం కల్పించలేదు. ఇటీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్‌పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు.

Also Read: IND vs SA: నేడు భార‌త్‌- ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మూడో టీ20.. ఇరు జ‌ట్ల ప్లేయింగ్ 11 ఇదేనా?!

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం QUAD సభ్య దేశాల మధ్య అసమతుల్యతను సృష్టించేలా కనిపిస్తోంది. ఈ గ్రూపింగ్‌లో దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇజ్రాయెల్, UAE లను కూడా చేర్చారు. ఈ చొరవ ప్రధానంగా క్రిటికల్ మినరల్స్ కోసం చైనాపై ఉన్న ఆధారితాన్ని తగ్గించడానికి, ముఖ్యమైన ఖనిజాల సరఫరా గొలుసును (సప్లై చైన్) బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది. ట్రంప్ ఈ నిర్ణయం భారత్-అమెరికా దౌత్య సంబంధాలను బలహీనపరుస్తుందని భావిస్తున్నారు.

  Last Updated: 14 Dec 2025, 11:21 AM IST