Indira Gandhi : దేశం కోసం ఇందిరాగాంధీ నగలిచ్చారా ? ప్రధాని మోడీ ‘మంగళసూత్రాల’ ఆరోపణ నిజమేనా ?

Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది. 

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 12:18 PM IST

Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది.  వారే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ !! ‘‘కాంగ్రెస్‌ దేశ సంపదను,  ఆడవాళ్ల నగల్ని కొల్లగొట్టి ముస్లింలకు పంచిపెడుతుంది’’ అని ప్రధాని మోడీ కామెంట్ చేశారు. ‘‘ఇందిరా గాంధీ దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేశారు’’ అంటూ రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయాన్ని ప్రియాంకా గాంధీ గుర్తు చేశారు. ‘‘రాజీవ్ గాంధీ దేశం కోసమే ప్రాణాలు వదిలారు.  అంతేకాదు చైనాతో భారత్‌ యుద్ధంలో  ఉన్నప్పుడు మా నానమ్మ తన బంగారు ఆభరణాలన్నింటనీ దేశం కోసం ఇచ్చేశారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. గాంధీ కుటుంబ త్యాగాల్ని ప్రధాని మోడీ మర్చిపోవద్దని ప్రియాంక హితవు పలికారు. ప్రియాంకాగాంధీ చెబుతున్న విధంగా ఇందిరాగాంధీ(Indira Gandhi) నిజంగానే దేశం కోసం తన సొంత బంగారాన్ని ఇచ్చేశారా ? వివరాలు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ప్రియాంక చెప్పింది దీని గురించేనా ?

  • 1962 సంవత్సరంలో భారత్‌, చైనా యుద్ధానికి దిగాయి. చైనా ఆర్మీ భారత సరిహద్దుల్లో దురాక్రమణకు యత్నించింది. లద్దాఖ్‌లోని చుషూల్ ప్రాంతంలోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చే యత్నం చేసింది. దీంతో భారత సైన్యం వాళ్లను ఎదుర్కొనేందుకు అప్పట్లో సమాయత్తం అయింది.
  • ఈ పరిస్థితుల నడుమ అప్పటి నెహ్రూ ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసింది. దేశంలోని మహిళలంతా తమ బంగారు ఆభరణాల్ని దేశం కోసం త్యాగం చేయాలని పిలుపును ఇచ్చింది. డబ్బులతో పాటు ఉలన్ దుస్తులను కూడా డొనేట్ చేయాలని కోరింది.
  • ఆ టైంలోనే నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కూడా తన బంగారు ఆభరణాల్ని విరాళంగా ఇచ్చి ఉంటారని అంటారు.
  • అదే విషయాన్ని  తాజాగా ఇప్పుడు ప్రియాంకా గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Also Read : World Leader : అగ్రరాజ్యంగా మేం కాకుంటే ఇంకెవరు ఉంటారు ? : బైడెన్

ప్రధాని చెప్పింది దీని గురించేనా ?

  • చైనాతో మన దేశం యుద్ధంలో ఉన్న కష్టకాలంలో దేశంలో అందరికంటే ముందుగా ఇందిరా గాంధీ చొరవ చూపించి తన ఆభరణాల్ని విరాళంగా ఇచ్చారని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయని చెబుతున్నారు.
  • ఈనేపథ్యంలో కొంతకాలం వరకు భారత్-చైనా యుద్ధం చేశాయి. అయితే ఆ తర్వాత చైనా తన సైన్యాన్ని వెనక్కి పిలుచుకుంది.
  • అప్పట్లో నెహ్రూ సర్కారు సేకరించిన బంగారు నగల లెక్కలు మాత్రం  అధికారికంగా  వెల్లడికాలేదు. చివరకు రిజర్వు బ్యాంకు రికార్డులలో కూడా ఈ సమాచారం అందుబాటులో లేకపోవడం గమనార్హం.
  • ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ   తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ..   ‘‘కాంగ్రెస్ పార్టీ మంగళసూత్రాలతో సహా దోచుకొని ముస్లింలకు ఇచ్చేస్తుంది’’ అని వ్యాఖ్యానించి ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Also Read :Aston Martin Vantage: వామ్మో.. ఈ కారు ధ‌ర ఎంతో తెలుసా..?